Followers

కరోనా వ్యాక్సినేషన్ పరిశీలన

 కరోనా వ్యాక్సినేషన్ పరిశీలన

తాళ్ళూరు,పెన్ పవర్

తాళ్ళూరు మండలం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా క్షయా నివారణ అధికారి కె.సురేష్ కుమార్, బుధవారం తాళ్ళూరు, తూర్పు గంగవరం ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రలలోని వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.  పేర్లు నమోదు చేసుకున్న వారంతా వ్యాక్సిన్ వేయంచుకోవాలని సూచించారు. మిగతా వాళ్లు కూడా త్వరగా పేర్లు నమోదు చేసుకోవాలి అన్నారు. అనంతరం వ్యాక్సిన్ వేయించుకున్న  వారికి పలు సలహాలు,సూచనలు చేశారు.  తాళ్ళూరు పీ హెచ్ సీ వైద్యాధికారిణి ఖద్దర్ మస్తాన్ బీ మాట్లాడుతూ  67 మంది వ్యాక్సిన్ వేయించుకునట్లు తెలిపారు. తూర్పు గంగవరం  పీ హెచ్ సీ వైద్యాధికారి బంక రత్నం మాట్లాడుతూ ఇప్పటి వరకు వృద్ధులు 150 మంది వ్యాక్సిన్ వేయించుకునట్లు తెలిపారు.60 ఏళ్ల  వయస్సు పై బడిన వారు,అలాగే 45 నుంచి 59 ఏళ్లలోపు ఉన్న వారిలో దీర్ఘకాల వ్యాధులున్న వారు పేర్లు నమోదు చేసుకోవచ్చు అన్నారు.60 ఏళ్ల పై వారు వయస్సు ధ్రువీకరణ పత్రం చూపిస్తే టీకా వేస్తామని, అదే 45 ఏళ్ల పై బడ్డ వారిలో దీర్ఘకాల వ్యాధులు ఉన్నట్లు కనీసం ఎంబీబీఎస్ డాక్టర్ నుంచి సర్టిఫికెట్ తీసుకొస్తే టీకా వేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో  వైద్య  సిబ్బంది వాణి,అనిత,అంజిరెడ్డి, శ్రీనివాసరావు, సుశీల,మస్తానమ్మ పాల్గొన్నారు.

రాష్ట్ర టెన్నికాయిట్ టీమ్ కు గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపిక

 రాష్ట్ర టెన్నికాయిట్ టీమ్ కు గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపిక  

 పెన్ పవర్,కరప

స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే రాష్ట్ర బీసీ వెల్ఫేర్ రెసిడినిషియల్ (బాలురు గురుకుల పాఠశాల)కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ ఈ.ఈశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడలో ఇటీవల జరిగిన జిల్లాస్థాయి టెన్నికాయిట్ పోటీలలో ప్రతిభ కనబరచి 9వ తరగతి విద్యార్థి ఎం.శేషాద్రి జిల్లా ఛాంపియన్‌గా గెలుపొందగా, అండర్-17 విబాగంలో రాష్ట్ర టీమ్కు ఎంపికయ్యాడన్నారు. 9వ తరగతి చదువుతున్న మరోవిద్యార్థి ఆర్ కె. అదినారాయణ అండర్-14 విభాగంలో రాష్ట్ర టెన్నికాయిట్ టీమ్ కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

చెరువు గట్టుపై చెట్లు నరికివేతపై ఫిర్యాదు

 చెరువు గట్టుపై చెట్లు నరికివేతపై ఫిర్యాదు

పెన్ పవర్, కరప

 యండమూరు గ్రామపంచాయతీ పరిధిలోని చెరువుగట్టుపై ఉండే చెట్లను అనుమతి లేకుండా నరికివేయడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తంచేశారు. పంచాయతీ అనుమతి లేకుండా చెట్లు నరికివేసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు మాజీ సర్పంచ్ మారెళ్ల వెంకటరమణ, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి శ్రీనివాస్ ఎస్.కుమారబాబు తదితరలు తెలిపారు. దీనిపై గ్రామకార్యదర్శి పి. వీరభద్రరావును వివరణ కోరగా చెరువుగట్టుపై ఉండే చెట్లు నరికివేయుటకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదని. బాధ్యులైనవారిపై చర్య తీసుకోవాలని అటవీశాఖాధికారులకు ఫిర్యాదుచేస్తున్నట్టు కార్యదర్శి తెలిపారు.

శివునికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న గోగు పువ్వు

 శివునికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న గోగు పువ్వు 

రాజన్న సిరిసిల్ల ,పెన్ పవర్


రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట కు చెందిన ప్రముఖ ఫోటో గ్రాఫర్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి   వినూత్న రీతిలో  శివరాత్రి  సందర్బంగా  నాగ పడిగే శివ లింగం నంది కి గోగు పువ్వు తో శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్న ఫోటో తీసి భక్తులను ఆశ్చర్య పరిసిన ఫోటో  గ్రాఫర్  ఇతను  ఫోటో గ్రఫీ లో జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి లో పలు అవార్డు లు పొందారు

డ్రైన్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా ఉండాలి

 డ్రైన్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా ఉండాలి

పెన్ పవర్,ఆలమూరు 

  గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది నిర్మాణాలు వేగవంతంగా జరగాలని ఆలమూరు మండల ప్రజాపరిషత్తు పరిపాలనాధికారి టి వి సురేందర్ రెడ్డి అన్నారు.  కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం నర్సపూడి గ్రామంలో  30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులను ఆయనతో పాటు ఆ గ్రామ పంచాయితీ కార్యదర్శి పి రాజుతో కలిసి పరిశీలించారు. డ్రైన్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గుత్తేదారులను అదేశించారు. డ్రెయిన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ కందిబొట్ల శ్రీను, వైఎస్సార్ సిపి నాయకులు  చల్లా సుబ్రహ్మణ్య  (సుబ్బయ్య),  ఉండమట్ల వెంకటేశ్వరరావు (అబ్బు) వైసిపి కార్యకర్తలు  గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి

 తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి

కూకట్ పల్లి,పెన్ పవర్

ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూకట్ పల్లి తెలుగుదేశం కార్యకర్తలు తమ అభ్యర్థి గెలుపు కొరకు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ మహా నగరానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని, హైటెక్ సిటీ నిర్మాణంతో లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించామని అన్నారు. తెరాస ప్రభుత్వ పాలనలో ఉద్యోగ అవకాశాలు లేక యువత, నిరుద్యోగులు అల్లడిపోతున్నారని, పట్టభద్రులు ఆలోచించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే నిరుద్యోగ సమస్యలు ఉండవని అన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల్లో  తెదేపా అభ్యర్థి ఎల్ రమణకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈకార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పద్మా చౌదరి, డివిజన్ అధ్యక్షులు షేక్ సత్తర్, సీనియర్ నాయకులు రామకృష్ణ, రేఖ, ఉమా, రమేష్ తుమ్మల, డివిజన్ తెలుగు యువత అధ్యక్షుడు గోపి, వర్మ, తదితరులు పాల్గొన్నారు .

కలియుగ దైవం వెంకన్నకు1,01,116/- రూపాయలు విరాళం

 కలియుగ దైవం వెంకన్నకు1,01,116/- రూపాయలు విరాళం


పెన్ పవర్,ఆత్రేయపురం

వాడపల్లి గ్రామంలో కొలువుతీరిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత స్వయంభు స్వామి  వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఆ వెంకటేశ్వరస్వామి నిత్య అన్నదానానికి పశ్చిమగోదావరి జిల్లా  ఉండి మండలం మహాదేవిపట్నం గ్రామానికి చెందిన పొట్ట సీతారాముడు జ్యోతి దంపతులు 1,01,116/- రూపాయలు విరాళంగా ఇచ్చారు ఈ దంపతులు దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ అర్చకులు ఆ వైకుంఠవాసుని చిత్ర పటాన్ని ఇచ్చి  కృతజ్ఞతలు తెలియజేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...