Followers

క్లాసిక్ దాబా వద్ద యూటర్న్

 క్లాసిక్ దాబా వద్ద యూటర్న్ తెరిపించిన ఛైర్మన్...

పెన్ పవర్,మేడ్చల్

మేడ్చల్ పట్టణంలోని క్లాసిక్ దాబా వద్ద గల యూటర్న్ ను మూసివేయడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఈ యొక్క యూ టర్న్ మేడ్చల్ పట్టణ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఈ రోజు ఉదయం మేడ్చల్ మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ లో తెలియజేయడంతో మంత్రి మల్లారెడ్డి  తక్షణమే స్పందించి రవాణా శాఖ, ట్రాఫిక్ డిసిపి విజయ్ కుమార్ కి ఫోన్ చేసి యూటర్న్ ను తక్షణమే తీసివేయాలని ఆదేశించారు. ఈ విషయం పై స్పందించిన డిసిపి విజయ్ కుమార్,  అల్వాల్ డివిజనల్ ట్రాఫిక్ సిఐ రాజశేఖర్ రెడ్డికి, మేడ్చల్ సిఐ ఆదేశాలు ఇవ్వడంతో వారివురు వచ్చి మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్  మర్రి దీపిక నర్సింహ్మ రెడ్డి, కౌన్సిలర్స్ పెంజర్ల స్వామి యాదవ్, నడికప్పు ఉమా నాగరాజు ముదిరాజ్, కౌడే మహేష్ కురుమ, వీరమల్ల మానస శ్రావణ్ గుప్త‌‌‌, నారెడ్డి కృష్ణవేణి రవీందర్ రెడ్డి, జాకట దేవరాజ్, సముద్రం సాయి కుమార్, మేడ్చల్ పట్టణ మాజీ ఉప సర్పంచ్  మర్రి నర్సింహ్మరెడ్డి, మేడ్చల్ మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు  చెర్వుకొమ్ము శేఖర్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పానుగంటి రవీందర్, నడికొప్పు నాగరాజు ముదిరాజ్, మేడ్చల్ మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు  నీలిమ, వరలక్ష్మి, మోనార్క్, సన్నీ మరియ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే గృహనిర్మాణాలు

 ప్రభుత్వ నిబంధనల ప్రకారమే గృహనిర్మాణాలు

పెన్ పవర్,ఆలమూరు

     ప్రభుత్వ నిబంధనల ప్రకారమే గృహ నిర్మాణాలు జరగాలని గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పిడి)విశ్వేశ్వర ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు అమలులో భాగంగా చేపట్టిన గృహ నిర్మాణాలను తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం నర్శిపూడి, ఆలమూరు గ్రామాల్లో ప్రభుత్వఅధికారులు   ఏర్పాటు చేసిన లేఅవుట్ లలో నిర్మిస్తున్న గృహాలను గృహ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గణపతి, డివిజనల్ ఇంజనీర్ జి శ్రీనివాస ప్రసాద్, ఏఈ జేజిబాబు, ఆలమూరు ఎంపీడీవో జేఏ జాన్సీ లతో కలిసి నిర్మాణాలను తనిఖీలు చేశారు.

మొదటి విడతగా ఆలమూరు ఎర్ర కోలనీలో 385 గృహాలకుగాను 302 గృహాలు మంజూరు కాగా, వాటిలో 11గృహల నిర్మాణంతో పాటుగా నర్సిపూడిలో ఒక గృహం నిర్మాణం చేపట్టినట్టు వారు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే గృహ నిర్మాణం జరగాలని, ప్రభుత్వ లేఅవుట్లలో నిర్మించే సామూహిక గృహాలకు పునాదులు ఎత్తులో నిర్మిస్తే ఖర్చు అధికమవుతాయని గృహ నిర్మాణ సంస్థ అధికారులు నిర్ణయించిన కొలతల ప్రకారమే గృహ నిర్మాణాలు జరగాలని ఆయన అన్నారు. అనంతరం అమలాపురం డివిజన్ రావులపాలెంలో కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం మండలాల గృహ నిర్మాణాలపై ఆయా మండలాల ముఖ్య అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజినీర్లు పి దేవి, పీ నగేశ్, బి రోషిణి పలువురు అధికారులు పాల్గొన్నారు.

నిందితులను అరెస్టు చేయాలంటూ హిందు వాహిని ఆధ్వర్యంలో రాస్తారోకో

 నిందితులను అరెస్టు చేయాలంటూ  హిందు వాహిని ఆధ్వర్యంలో రాస్తారోకో

 వనపర్తి, పెన్ పవర్

వనపర్తిలో హిందూ వాహిని ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి  విభాగ్ కో కన్వీనర్ అభిలాష్  హౌదే  కార్ ప్రసంగిస్తూ  ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో  ఉన్న హిందువుల పైన వారి ఆస్తుల పైన వ్యాపార సంస్థల పైన దాడులను ప్రోత్సహించే వారికి అండదండలు లు కల్పించి తరచుగా హిందువులపై దాడులు చేయాలని చూస్తున్నారని,  హిందువులను బలిపశువులను చేస్తున్నారని తెలిపారు. పదే పదే హిందువులపై జరుగుతున్న దాడులు జరుగుతున్నాయని చెప్పారు. దుండగులను వెంటనే అరెస్టు చేయాలి అరెస్టు చేసి క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ హిందువులపై పునరావృతం కావద్దని కోరారు.ధర్నా కార్యక్రమంలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది హిందు వాహిని కార్యకర్తలను  పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ అరుణ్ జిల్లా భేటీ బచావో ప్రముఖ సహా ప్రముఖ నవీన,పట్టణ అధ్యక్షుడు శివకృష్ణ,రోహిత్,గణేష్, ప రాకేష, మణిదీప్,చరణ్ ,ప్రేమ్ నందా, నీలేష్,నరేష్,సాయి, గిరీష్,తదితర హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాలకు స్ట్రాంగ్ రూమ్ కను పరిశీలించిన జె సి మరియు ఎస్ పి

 పోలింగ్ కేంద్రాలకు స్ట్రాంగ్ రూమ్ కను పరిశీలించిన  జె సి మరియు ఎస్ పి 

పెన్ పవర్,కొవ్వూరు

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం లోని పోలింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి కె. నారాయణ నాయక్.కొవ్వూరు మున్సిపల్  ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో  కొవ్వూరు పట్టణం నందు సమస్యాత్మక,అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి, సదరు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును గురించి తనిఖీలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్  హిమాన్షు శుక్ల మాట్లాడుతూ రెవిన్యూ ,పోలీస్ సిబ్బంది కలిసి ఎన్నికలు సామరస్యంగా, నిష్పక్షపాతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసాం.ఓటర్ల లందరూ అధికారుల ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తపరచారు.వారి యొక్క ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిర్భయంగా  వినియోగించుకుంటున్నారు. ఎస్పీ నారాయణ నాయక్ మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో వారికి రాజ్యాంగబద్ధంగా లభించిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలాగా పోలీసు రక్షణ ఏర్పాట్లు చేశారు.కొవ్వూరు  మున్సిపాలిటీ పరిధిలో  ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి.పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చే గర్భిణీ స్త్రీలు, వికలాంగులు మరియు వృద్ధులకు పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తూ ఎలక్షన్ కమిషన్ వారి యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ ఉద్యోగ నిర్వహణ చేస్తున్నారు.అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరుచు స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించి ఆక్కడ  మున్సిపల్, రెవిన్యూ, పోలీసు సిబ్బంది సమన్వయంతో కట్టుదిట్టమైన  భద్రతను ఏర్పాటు చేసినట్లుగా తెలియజేసినారు.జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ నారాయణ నాయక్ తో పాటు కొవ్వూరు రెవిన్యూ డివిజనల్ అధికారి డి. లక్ష్మారెడ్డి ,ఎస్సీ ఎస్టీ సెల్ 1 డిఎస్పీ  ఏ.శ్రీనివాసరావు, కొవ్వూరు టౌన్ సీఐ ఎం. వి. వి. ఎస్. ఎన్. మూర్తి, కొవ్వూరు టౌన్  ఎస్సై లు  మరియు సిబ్బంది పాల్గొన్నారు.

గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్లు

 గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్లు బడ్జెట్ కేటాయించాలి .ఇనుగంటి శ్రీనివాస్

పెన్ పవర్,జగిత్యాల 

జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలానికి చెందిన ఇనుగంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలోNRI పాలసీ సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఈసారి బడ్జెట్ లో ఐదు వందల కోట్ల నిధులు  తెలంగాణ NRI పాలసీ కొసం కేటాయించాలి, అని  గల్ఫ్ లో జీవనం సాగిస్తున్న మేము అందరం GWAC అధ్యక్షులు శ్రీ కృష్ణ దొనికిని గారి పిలుపు మేరకు మేము దుబాయ్ లోని ఎమిరేట్స్ హిల్స్ లో నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇనుగంటి శ్రీనివాస్, ప్రవీన్, కన్నా, ఉపేంద్ర, రావు, సాయి, శేకర్, రవిశంకర్, అనిల్, సతీష్, చారి, అజారుద్దీన్, రాజేష్, స్వామి, నాగేంద్ర, భూమేష్, మహేష్, రాకేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు..

సావిత్రి బాయి ఫూలే ఆశయాలను కొనసాగిద్దాం....

 సావిత్రి బాయి ఫూలే ఆశయాలను కొనసాగిద్దాం....

స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్

అదిలాబాద్ , పెన్ పవర్ 

అట్టడుగువర్గాలు, మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింప పడిన దేశంలో ఆనాటి సమాజ కట్టుబాట్లను ధిక్కరించి స్త్రీలకు పాఠశాలలు నిర్మించి పాఠాలు నేర్పిన విద్యాదేవత సావిత్రి బాయి పూలే అని స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సోన్ కాంబ్లే వికాస్ అన్నారు. బుధవారం స్థానిక అంభేడ్కర్ భవనములో స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే వర్థంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే స్త్రీల హక్కుల కోసం ఎంతగానో పోరాడారన్నారు. ప్రతి ఒక్కరూ ఆమె ఆశయ సాధన కోసం కృషి  చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో భీం ఆర్మీ అధ్యక్షుడు సందీప్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్ కాంభ్లే బాబారావు, వార్డు సభ్యులు థిట్టే నాగరాజ్, గాయక్ వాడ్ భారత్, స్వేరోస్ మండల నాయకులు జంధడే బాలాజీ, సూర్యవంశీ బాదల్, గాయక్ వాడ్ బాబాసాహెబ్, వాగ్మారే పండిత్, తదితరులు పాల్గొన్నారు.


మీడియా పై దాడులు తగదు

 మీడియా పై దాడులు తగదు

జర్నలిస్టులకు భద్రత కల్పించాలి

ఆదిలాబాద్,పెన్ పవర్

నిర్మల్ జిల్లా భైంసాలో జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తూ బోథ్ నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో బోథ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై  దాడులు పెరిగిపోయాయన్నారు. దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.దాడుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారని, వారిపైనే దాడులు జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.వెంటనే జర్నలిస్టులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయడంతో పాటు శిక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...