రాష్ట్ర టెన్నికాయిట్ టీమ్ కు గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపిక
పెన్ పవర్,కరపస్థానిక మహాత్మ జ్యోతిబాపూలే రాష్ట్ర బీసీ వెల్ఫేర్ రెసిడినిషియల్ (బాలురు గురుకుల పాఠశాల)కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ ఈ.ఈశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడలో ఇటీవల జరిగిన జిల్లాస్థాయి టెన్నికాయిట్ పోటీలలో ప్రతిభ కనబరచి 9వ తరగతి విద్యార్థి ఎం.శేషాద్రి జిల్లా ఛాంపియన్‌గా గెలుపొందగా, అండర్-17 విబాగంలో రాష్ట్ర టీమ్‌కు ఎంపికయ్యాడన్నారు. 9వ తరగతి చదువుతున్న మరోవిద్యార్థి ఆర్ కె. అదినారాయణ అండర్-14 విభాగంలో రాష్ట్ర టెన్నికాయిట్ టీమ్ కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.







