Followers

వ్యాపారమే కాదు భక్తి భావంతో సమాజ సేవ చేయాలి

వ్యాపారమే కాదు భక్తి భావంతో సమాజ సేవ చేయాలి

పెన్ పవర్,ఆలమూరు 

       ప్రస్తుత కాలంలో చుట్టాలకి స్నేహితులుకి పక్కింటి వారికి కూడా గుప్పెడు అన్నం పెట్టడానికి వెనకడే మనుషుల మధ్య బతుకుతున్నాం, వ్యాపారం దృక్పథాన్ని పక్కనపెట్టి భక్తి భావంతో సమాజసేవ చేస్తున్న తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి శ్రీ అభయ ఆంజనేయ స్వామి అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్ కమిటీ చేస్తున్న బారి అన్నదాన సేవలు అభినందనీయమని ఆలమూరు మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ (ఏఎంసీ) తమ్మన సుబ్బలక్ష్మి శ్రీనివాస్, మండల కన్వీనర్ తమ్మన శ్రీను అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని  మార్కెట్ ప్రాంగణంలో సుమారు 20 వేల మందికి బారీ అన్నదానం చెయ్యటం చాలా హర్షించదగ్గ విషయమనారు. మా ఆలమూరు మండలంలోని మనుష్యులు మాత్రంమే సేవ చేయడానికి పోటీపడతారని, ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాల బాటసారులకు మన గోదారోళ్లు చేసిన సేవలే ఇందుకు ఉదాహరణ అని మరలా భక్తి భావంతో ఇలా అన్నదానం చేయడం మరోసారి రుజువైందని అన్నారు. అనంతరం కూరగాయల మార్కెట్ కమిటీ సభ్యులను ఏఎంసీ చైర్మన్ తమ్మన దంపతులు సన్మానం చేయగా తమ్మన దంపతులతో పాటుగా మడికి సర్పంచ్ ఉప సర్పంచ్ లను కూరగాయల మార్కెట్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ అభయాంజనేయ స్వామి అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్ చైర్మన్ పాలూరి సత్తిబాబు, దొండపాటి సుబ్బరాజు, చెల్లుబోయిన సింహాచలం, అయినివిల్లి సత్తిపండు, పర్వతనేని రామారావు (అబ్బు), దొండపాటి వెంకన్న, కొత్తపల్లి నాగేశ్వర్రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు యనమదల నాగేశ్వరరావు, పడమటి రాంబాబు, అడ్డాల సత్యనారాయణరాజు, చెల్లుబోయిన శ్రీనివాస్, మల్లెమొగ్గల చిన్న, పలువురు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

శివనామస్మరణతో మారుమ్రోగిన శైవక్షేత్రాలు

 శివనామస్మరణతో మారుమ్రోగిన శైవక్షేత్రాలు







 

పెన్ పవర్,ఆలమూరు 

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని హరహర మహాదేవ శంభో అంటూ శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు  మారుమ్రోగాయి. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి శ్రీ బాల త్రిపుర సుందరీదేవి సమేత శ్రీ సోమేశ్వరస్వామి, మూలస్థాన అగ్రహారంలో గల శ్రీ ఉమా ముాలేశ్వర స్వామి, చొప్పెల్లలో శ్రీ పార్వతీ మల్లేశ్వరస్వామి వారు, ఆలమూరు శ్రీ పార్వతి విక్రమ బట్టేశ్వర స్వామి,  జొన్నాడలో గల ఉమా మల్లేశ్వరస్వామి, పెనికేరు ఇష్ట కాంతేయ స్వామి, చింతలూరు ఉమా పృధ్వీశ్వరస్వామి, పెద్దపల్ల ఉమా మల్లేశ్వరస్వామి, నర్సిపూడి పార్వతి సోమేశ్వరస్వామి వారి  ఆలయాల్లో తెల్లవారు జాము నుండి  ఆది దంపతులకు ప్రత్యేక తైలాభిషేకాలు నిర్వహించారు. ఆయా ఆలయాల కార్యనిర్వాహక కార్యదర్శులు భక్తుల దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ఆదిదంపతుల దర్శనానికి వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలను పలువురు భక్తులు అందజేశారు.

కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిన కొంపల్లి

 కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిన కొంపల్లి 2వ వార్డు కౌన్సిలర్..

దుండిగల్,పెన్ పవర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీ 2వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ జే.మంజుల కుమార్ గౌడ్ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై గురువారం గండి మైసమ్మలోని జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో కొంపల్లి చైర్మెన్ సన్న శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్ ప్రభుత్వం అతి తక్కువ వ్యవధిలోనే చేసిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామ్యులు అయ్యేందుకు ఇతర పార్టీల నుండి అనేక మంది చేరుతున్నారని, పార్టీపై నమ్మకంతో చేరిన ప్రతి ఒక్కరికీ అధిష్టానం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ  కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

బైంసాలో అల్లర్లు సృష్టించిన వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి

 బైంసాలో అల్లర్లు సృష్టించిన వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి

హిందూవాహిని సభ్యుల డిమాండ్

లక్షెట్టిపెట్,పెన్ పవర్

పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తాలో హిందువాహిని సభ్యులు బైంసాలో అల్లర్లను చెలరేపిన ఎంఐఎం నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తు జాతీయ రహదారిపై బుదవారం రాస్తారోకో చేపట్టారు.ఈ సందర్భంగా హిందువాహిని జిల్లా ఇంచార్జ్ ఆదర్భ్ భారతన్ మాట్లాడుతూ బైంసాలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ మున్సిపల్ వైస్ చేర్మన్ జబీర్ అహ్మద్ అనే రౌడీ  షీటర్ రోహంగ్యాలకు ఆశ్రమం కల్పించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇరువులపై,హిందువుల వాహనాలపై,దుకాణాలపై ఎంఐఎం లను ప్రోత్సహిస్తు దాడులు జరిపిస్తున్నాడన్నారు.ప్రభుత్వం వెంటనే అల్లర్లు సృష్టించిన ఎంఐఎం  నేతనలు అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు రాస్తారోకో అనంతరం జాతీయ రహదారిపై ఎంఐఎం నేతల దిష్టిబొమ్మను దహనం చేసారు.హిందువాహిని సభ్యులు చేస్తున్న నిరసనకు బిజెపి నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొని మద్దత్తు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందువాహిని సభ్యులు వంశీ,మదూకర్,చందు, తో పాటు బిజెపి నాయకులు వీరమల్ల హరిగోపాల్,వేముల మదు,కిషన్,సతీస్,చంద్రమౌళి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

సావిత్రిబాయి పూలే సేవలు మరువలేనివి

 సావిత్రిబాయి పూలే సేవలు మరువలేనివి

మందమర్రి, పెన్ పవర్

చదవుల తల్లి సావిత్రిబాయి పూలే దేశానికి, మహిళలకు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని బిజెపి దళిత మోర్చా మందమర్రి పట్టణ అధ్యక్షులు మార్త కుమార స్వామి పేర్కొన్నారు. బుధవారం సావిత్రిబాయి పూలే 124వ వర్ధంతిని పురస్కరించుకొని మందమర్రి పట్టణం యాపల్ ప్రాంతంలోని సింగరేణి డిస్మిస్ కార్మిక సంఘం దీక్షా శిబిరం వద్ద ఆమెకు నివాళులు అర్పించారు. ముందుగా డిస్మిస్ కార్మిక సంఘం మహిళా అధ్యక్షురాలు కొట్ట లక్ష్మి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బిజెపి దళిత మోర్చా పట్టణ అధ్యక్షులు మార్త కుమారస్వామి మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, మహిళల విద్య అభివృద్ధికి పూలే దంపతులు ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. సాంఘీక దురాచారాలను రూపుమాపడంలో వీరు అవమానాలు,బెదిరింపులను ఎదుర్కొని పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు రాంటెంకి దుర్గరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గాజుల ప్రతాప్, దళిత మోర్చా పట్టణ కార్యదర్శి రామ్ కిష్టయ్య, పిట్ట రాజమొగిలి, ఎం భద్రయ్య, తులసీ మదన్, డిస్మిస్ కార్మిక సంఘం నాయకులు బేడబోయిన రవీందర్, పావురాల దుర్గయ్య,దూట లలిత తదితరులు పాల్గొన్నారు.

నేను కాలుతూనే...నీ జీవితాన్ని కాలుస్తా

 నేను కాలుతూనే...నీ జీవితాన్ని కాలుస్తా...(సిగరెట్టు)

రామకృష్ణాపూర్, పెన్ పవర్ 

ధూమపాన రహిత దినోత్సవం సందర్భంగా యువతలో ధూమపానం వల్ల  కలిగే అనర్ధాలపై అవగాహన కలిగిస్తూ, కరపత్రాలను ఆరోగ్య హక్కు వేదిక ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలో బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్షులు మోతె రాజలింగు మాట్లాడుతూ, సరదాగా  సిగరెట్టు తాగకూడదని, ఒకసారి అలవాటైతే బానిసత్వమే నని ఆయన అన్నారు. వివిధ రకాలైన క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని, సిగరెట్టు కాలుతూ మన జీవితాలను  కాలుస్తుందని ఆయన తెలిపారు. వేదిక ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించి యువతలో అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు కల్వాడి గణ శ్యామ్, వేల్పుల వెంకట స్వామి, కడమంచి సాయి, బూర్ల పవన్, వాజి అనికేత్, వెంకటేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు

 అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు

మందమర్రి, పెన్ పవర్

ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం సావిత్రి భాయ్ పూలే 124వ వర్ధంతిని నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కన్వీనర్ మొయ్య రాంబాబు ఆధ్వర్యంలో బుధవారం మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే వర్ధంతిని నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం రాంబాబు మాట్లాడుతూ, దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా బడుగు, బలహీన వర్గాలకు సేవలు అందించండంతో పాటు, వారికి చదువు అవశ్యకతను వివరించి విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో పూలే దంపతులు చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కో కన్వీనర్ సకినాల శంకర్, కలీం, రాష్ట్ర కార్యదర్శి పాత వీరస్వామి, నాయకులు కనకం రవీందర్, గిన్నారపు రవి, కల్వల శంకర్, అనిల్, జూపాక సంపత్, ఉప్పులేటి నరేష్, మొగిలి, శ్రీనివాస్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...