Followers

బెల్లంపల్లి లేబర్ యూనియన్ కి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికైన కాసర్ల యాదగిరి

 బెల్లంపల్లి లేబర్ యూనియన్ కి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా  ఎన్నికైన కాసర్ల యాదగిరి 

బెల్లంపల్లి,పెన్ పవర్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లోని రోజువారి కూలి సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా కాసర్ల యాదగిరి ని ఎన్నుకోవడం జరిగింది.యాదగిరి మాట్లాడుతూ ప్రతి ఒక్క లేబర్ యూనియన్ కార్డు కలిగి ఉండాలని కొంతమంది పనికి కార్మికులను తీసుకెళ్తూ యజమాని వద్ద ఆరు వందల రూపాయలకు అగ్రిమెంట్ కుదుర్చుకుని కూలీలకు 400. 500. ఇస్తూ వారి యొక్క రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారు అలాంటి వ్యక్తులు మళ్లీ ఇలాంటి సమస్య పునరావృతం కాకూడదని కోరుతూ ఈ యొక్క సంఘం ఆకలితో ఏర్పడ్డ సంఘం అని హక్కులు సాధించుకునేందుకు నిరంతరంగా కృషి చేస్తామని బెల్లంపల్లి చుట్టుపక్కల ఫ్లై ఓవర్ నిర్మాణాలు రైల్వే పనులు హైవే పనులు బెల్లంపల్లి భవన కార్మికుల ను 30 శాతం వరకు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మా యొక్క సంఘం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఇది హక్కుల కోసం ఏర్పడ్డ సంఘం అని గుర్తించాలని అదే విధంగా అన్ని పార్టీలు అన్ని సంఘాలు మాకు మద్దతుగా ఉండాలని కొంతమంది కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల నుండి కూలీలను తీసుకు రావడం వల్ల బెల్లంపల్లి కార్మికులు తిరని అన్యాయం జరుగుతుందని  అని అన్నారు  రోజుకు కార్మికులు  సుమారుగా  500 మంది వస్తూ 300 మంది  పని దొరకకా వెనుకకు పోతున్నారు కాబట్టి బెల్లంపల్లి కార్మికులకు పని కల్పించాలని అన్నారు ఒక సంఘం నిర్మాణానికి నా మీద నమ్మకంతో అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ చేపడతామని అన్నారు

ఘనంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

 ఘనంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  జన్మదిన వేడుకలు ..

బెల్లంపల్లి ,పెన్ పవర్


బెల్లంపల్లి లో గల  2- గ్రౌండ్ నందు ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించి మొక్కలు నాటి, జాగృతి నాయకుల ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం రక్త దాన కార్యక్రమం మరియు చలివేంద్రం ఏర్పాటు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన  మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కళ్యాణి భీమా గౌడ్ వైస్ చైర్మన్ సుదర్శన్  ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిల్ & కో ఆప్షన్ సభ్యులు , తెలంగాణ జాగృతి నాయకులు,తెరాస యువ నాయకులు,తెరాస కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

అన్ని దానాల కన్నా రక్త దానం గొప్పది

 అన్ని దానాల కన్నా రక్త దానం గొప్పది

మందమర్రి, పెన్ పవర్ 


అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది మందమర్రి ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఏరియాలోని ఎంవిటిసి కార్యాలయంలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణిలోని యువ కార్మికులు 45 మంది రక్తదానం చేయడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. 2019 నుండి 2021 మార్చి 13 వరకు 26 రక్తదాన శిబిరాలు నిర్వహించి 1706 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఆయన వివరించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు  తెలియజేశారు. సేకరించిన రక్తాన్ని మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ వారికి అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ వరప్రసాద్, ఎంపీటీసీ డిజిఎం కృష్ణారావు, ట్రైనింగ్ అధికారి అశోక్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కాసర్ల శ్రీనివాస్, బెల్లంపల్లి సబ్ డివిజన్ సభ్యుడు సూరం లక్ష్మీనారాయణ, రక్తనిధి వైద్యులు అజీమోద్దీన్, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

 ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

మందమర్రి, పెన్ పవర్


నిజాంబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు మందమర్రి పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఏరియాలోని అన్ని గనులు, విభాగాలు, యూనియన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి పెట్టి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్ మాట్లాడుతూ, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించ బడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఆమె మరిన్ని జన్మదినాలు జరుపుకొని అయుఆరోగ్యాలతో, సుఖసంతోషాలతో సుఖంగా జీవించాలని ఆయన భగవంతుని కోరుకున్నాను. అదేవిధంగా పట్టణంలోని వెంకటేశ్వర దేవస్థానంలో జిల్లా జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే,మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు జే రవీందర్, నల్లాల క్రాంతి కుమార్, మండల సింగిల్విండో చైర్మైన్ ఎస్ ప్రభాకర్, బడికెల సంపత్ కుమార్, బండారి సూరిబాబు, తిరుమల్ రెడ్డి, కొండల్ రావు, జీడీ బాబు, మిట్ట సూర్యనారాయణ, పుప్పాల సది, సంతోష్, యూనియన్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రాజరాజేశ్వరి ఆలయంలో ఎడ్ల బండ్ల పోటీలు

 రాజరాజేశ్వరి ఆలయంలో ఎడ్ల బండ్ల పోటీలు

గొల్లపల్లి,పెన్ పవర్

గొల్లపెల్లి మండలం లొత్తునూర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి  ఆలయంలో మూడు రోజులపాటు జాతర మహోత్సవం జరుగగా ఆలయ ఆవరణంలో ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించిగా పోటీలలో పన్నెండు బండ్లు పాల్గొనగా వీరిలో మొదటి బహుమతి షేక్ బాష్ మియా గెలుపొందగా,వీరికి గౌడ సంఘము పావుతులం బంగారం,రెండవ బహుమతి మదాసు వెంకటశివ గెలుపొందగావీరికి సామాల పెద్ద గంగారాం ఎనిమిది తులాల వెండి, మూడవ బహుమతి నలిగేటి కార్తిక్ లు గెలుపొందగా ఓరగంటి మల్లేష్ నాలుగు తులాల వెండిని దాతలు గెలుపొందినవారికి అందజేశారు.భక్తులకు మైదం సురేష్-ఉమ దంపతులు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేశ్వరి,ఎంపిటిసి సంతోషి-మారుతి, పుట్టపాక సత్యం,బండి సత్యం, పొన్నం స్వామి,బిసగొని మల్లేశం, బోనాల రత్నయ్య ఆకుల రాజు ఎమ్.తిరుపతి లక్ష్మికాంతం, తిరుపతి,చంద్రయ్య,కొండయ్య రవి స్వాములు గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు

రోడ్లన్నీ గోతుల మయం చేస్తున్న గుత్తేదారులు

రోడ్లన్నీ గోతుల మయం చేస్తున్న గుత్తేదారులు 

చింతూరు,పెన్ పవర్

 చింతూరు మoడలంలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. నేషనల్ హై వే బాగున్నాయి అనుకుంటే అవి కాస్త పాడు చేస్తున్నారు కాంట్రాక్టర్లు వివరాల్లోకి వెళితే చింతూరు నుండి ఒరిస్సా లోని మోటు   గ్రామాన్ని  కలిపే ఎన్ హెచ్ 326 ఎక్కడ గోతులు లేకుండా నీట్ గా ఉంది. ఆ రోడ్డు మీద వాటర్ పైప్ లైన్ నిర్మాణం కోసం  ధ్వంసం చేస్తున్నారు .అయినా దానికి సంబంధించిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో రాత్రికి రాత్రి తవ్వి పైపులు వేస్తూ వెంటనే  పూడుస్తున్నారు. చింతూరు వద్ద అ ఆర్డబ్ల్యూఎస్ శాఖ కోట్ల రూపాయలతో గత రెండున్నర సంవత్సరాల క్రితం పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించింది. మండలంలోని సుమారు 26 గ్రామాల ట్యాంకులకు ఎర్రం పేట లోని ఓవర్హెడ్ ట్యాంకు నుండి  రక్షిత మంచినీరు సరఫరా చేయాల్సి ఉంది . ఇందులో భాగంగా కల్లేరు లో ఉన్న ట్యాంక్ ను నీటి సరఫరా కోసం పైపులైన్లు వేస్తున్నారు. అయితే పైపులైన్లు  వేయాల్సిందే కానీ  అది రోడ్డు ను ధ్వంసం చేసి  పైపు  లైన్ నిర్మాణం చేయమని ఎవరు చెప్ప లేదు. రోడ్డు పై నుండి కిందకు దిగితే సమయం ఎక్కడ అ ఎక్కువ పదుతుందో అన్న ఆలోచనతో కాంట్రాక్టర్ స్వార్థం కోసం రోడ్డును ఆనుకొని  వెట్ మిక్స్ అడుగు ఉన్న ఈ ప్రాంతంలో సుమారు మీటర్ల లోతు తవ్వి అందులో హడావిడిగా పైపును వేసి గోతులు నింపుతున్నారు .కొన్నిచోట్ల రోడ్డును ఆనుకొని తవ్వేశారు .రోడ్డుపై ఎక్కడ మట్టిని అక్కడే వదిలేశారు మట్టిని తొలగించడంతో పాటు వర్షాకాలంలో  రోడ్డు దిగి పోకుండా తగిన విధంగా ఎవరైతే తవ్వేశారో వాళ్లే దాన్ని సరి చేసే లాగా అధికారులు చర్యలు తీసుకుంటే ప్రమాదం జరగకుండా చూడవచ్చు. రాబోయే వర్షాకాలంలో రోడ్డును ఏ భారీ వాహనాలు అయినా  ఒక్క అంగుళం కిందకు దిగినా పైపుల కోసం తవ్విన గాడిలో వాహనం దిగ బడి పోయే అవకాశం ఎక్కువగా ఉందనే విషయం అధికారులకు తెలుసు.  కాంట్రాక్టర్ కి కూడా తెలుసు అయినా ఎవరి స్వార్థం వారిది . ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, తక్షణం చర్యలు  తీసుకుంటామని ఆర్ అండ్ బి శాఖ   డీఈ గణేష్ విలేఖర్లకు తెలిపారు.

శివారు రైతులకు నీటి కష్టాలు

 శివారు రైతులకు నీటి కష్టాలు

పెన్ పవర్,పెంటపాడు

సాగునీరు అందక పంటపోలాలు ఎండిపోతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తుందని రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షులు మార్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు పెంటపాడు మండలములోని పలుశివారు ప్రాంతాలతోపాటు జిల్లా వ్యాపితంగా సాగునీరు అందడం లేదని తెలిపారు.రైతుల కోరిక మేరకు తెలుగురైతు బృందము కస్పా పెంటపాడు శివారు ముక్తేపురం పోలాలను పరిశీలించారు.గడచిన 10 రోజులుగ సాగునీరు అందక పంటభూములు నెరలు తీసాయని బృందము పరిశీలించింది.గడచిన సార్వా సీజన్ అదిక  వర్షాల ఎకరాన్నికి 20 వేలు నష్టపోయిన  తమకు ప్రస్తుత సాగునీటి వల్ల మరింత నష్టం జరిగేతే అత్మహత్యలు చేసుకొనే పరిస్తితి ఉన్నాయి అని  రైతులు బృందనాకి వివరించారు.ఈ కార్యక్రమములోగూడెం టీడీపి ఇంచార్జి  వలవల బాబ్జీ,నరసాపురం ,ఏలూరు ,గుంటూరు పార్లమెంట్ తెలుగురైతు అధ్యక్షులు పాతూరి రామ్ ప్రసాద్ చౌదరి ,గుత్తా వెంకటేశ్వరరావు కళ్లెం రాజశేఖర్ రెడ్డి ,కస్పా పెంటపాడు, పెదతాడేపల్లి సర్పంచ్లు పీతల సత్యనారాయణ ,పోతుల అన్నవరం మాజీ జడ్ పి టి సి కిలపర్తి వెంకట్రావు మాజీ ఎం పి పి  పరిమి రవికుమార్  మాజీ డీసీసీబీ  డైరెక్టర్ దాసరి అప్పన్న మాజీ ఏ ఎం సి  సభ్యులు ఇమ్మంది లక్ష్మయ్య అచ్యుత సత్యనారాయణ నవాబుపాలెం మాజీ సోసైటీ అధ్యక్షులు పరిమి వీరభద్రరావుతదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...