Followers

రేణుక ఎల్లమ్మ కల్యాణానికి ఆహ్వానం

 రేణుక ఎల్లమ్మ కల్యాణానికి ఆహ్వానం



ఎల్లారెడ్డిపేట ,పెన్ పవర్

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గౌడ సంఘం సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ శ్రీనివాస్ గౌడ్ ను కలిసి  ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఇంచార్జ్ తోట ఆగయ్య జెడ్పిటిసి లక్ష్మణరావు చిదుగు గోవర్ధన్ గౌడ్ ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి మండల్ ప్రెసిడెంట్ వరుస కృష్ణ హరి మరియు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

మల్టిస్పెషాలిటి ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే దివాకర్ రావు

 మల్టిస్పెషాలిటి ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే దివాకర్ రావు


లక్షెట్టిపెట్, పెన్ పవర్

పట్టణ కేంద్రంలోని ఉత్కూర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన సుప్రజ మల్టీస్పెషాలిటి ఆసుపత్రిని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ పట్టణం నూతనంగా మున్సిపాలిటీ ఏర్పాటు నుండి దిన దినం చాలా అబివృద్ది చెందడం గర్వాంగా ఉందన్నారు.గతంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినప్పటికీ మంచిర్యాల,కరీంనగర్,హైదరాబాద్ ప్రాంతాలకు ప్రజలు వెళ్లి చూపించుకునేవారని దూర ప్రాంతాలకు వెళ్లడం అక్కడ ఎవరూ పరిచయిస్తులు లేకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో అధిక బిల్లులు చెల్లించి ప్రజలు ఇబ్బందులు పడ్డ రోజులు చాలా ఉన్నాయన్నారు.మండల ప్రజలకు అందుబాటులో దూర ప్రాంతాలకు వెళ్లకుండా అన్ని వసతులతో ఇక్కడ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం చాలా గర్వాంగా ఉందని పేద ప్రజలకు దృష్టిలో ఉంచుకుని మంచి వైద్య సేవలు అందించాలని యజమాన్యులను కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చెర్మాన్ నల్మాస్ కాంత్తయ్య,వైస్ చెర్మాన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్,కౌన్సలర్ ఒరగంటి శ్రీకాంత్,రైతు బంద్ కన్వీనర్ నడిమెట్ల రాజన్న,మేనేజింగ్ డైరెక్టర్ అస్మాత్ అప్రిన్,ఆసుపత్రి డైరెక్టర్ మామిడి నర్సయ్య,భాస్కర్ రెడ్డి,భూమన్న,రవీందర్ రాజు తదితరులు పాల్గొన్నారు

కొండెంగల భయం తో వానరలు పరార్

 కొండెంగల  భయం తో వానరలు  పరార్  

నర్మాల గ్రామం లో కనిపించడం లేదు  వానరాలు

వానరలతో కష్టాలు పోయినాయి










గంభీరావుపేట , పెన్ పవర్

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో  వానర  చేష్టలకు  గ్రామ ప్రజలు  విసిగి పోయారు  కిష్కీoదకాండకు వానరాల తో  ఇల్లు గుల్లవుతున్నాయి , ఇల్లు కప్పు ను పాడుచేస్తున్నా యిపంటలు  పొలం లో పాడుచేస్తూన్నాయి ఊళ్ళో  పంట పొలం లో అని తేడా లేకుండా  కోతులు  చేస్తున్నా బీభత్సా నికి  అడ్డు కట్ట వెయ్యాలని  భావించారు కోతుల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.   గ్రామపంచాయతీ నర్మాల గ్రామ సర్పంచ్ ఎడబోయినరాజు,సిబ్బంది,  గ్రామ వార్డు సభ్యులు సిబ్బంది.పాలక వర్గం గ్రామస్తులు   గ్రామస్తూలoతాచర్చిoచి  ఒక నిర్ణయనికివచ్చారు. తల కొంత డబ్బులు పోగు చేసి సుమారు  40  వేల రూపాయలతో  రెండు కొండెంగలు , కొండేమచ్చులు కొనుగోలు చేసి నర్మాల గ్రామం కు  తీసుకొని వచ్చారు ఇద్దరు కూలీ లను ఏర్పాటు చేసినారు  సకాలి  దాసరం  , వనం  సత్యనారాయణ ,  వీరు  కొండెంగలను వాటిని ప్రతి రోజు   ఉదయం  మరియు  సాయంత్రం   గల్లీ గల్లీ  సంధి విధుల్లో తిరుగుతూన్నారు. ఇళ్లల్లో  కోతులు   కానీపియ్యడం లేదు అంతే కాకుండా  గ్రామ ప్రజల పొలం వద్దకు సమీపంలో ఉన్నా పంట పొలం వద్దకు  తీసుకెళ్తున్నారు  అక్కడ  గుంపు గుంపులు ఉన్న కోతులు  కొండెంగలను చూసి  ఒక్క ఒక్క వానరం పరార్  అయినాయి.  కావునా 25 రోజు లనుండి  గ్రామం లో  వానరం కనిపించడం  లేదు మచ్చుకుక్కకు చూద్దాం మన్నా ఒక వానరం  గ్రామంలో కనిపించడం లేదుఅని అందరూ గ్రామస్తులు  ఊపిరిపీల్చుకున్నారు. ఇంటికి కొంత పోగు చేసి కొండేoగలను త్రిప్పే వారికీ కూలీ  డబ్బులు చేస్తున్నారు   కానీ  వారు డబ్బులు తీసుకొకుండడబ్బులు  వద్దు  అంటున్నారు ఖుషి కొద్ధి  కొండెంగలను తీసుకొని  తిరుగుతున్నారు. ప్రస్తుతంనికి  వానరాలబేడద లేదని  ప్రశాంతంగాఉన్నాం అని  వ్యక్తం చేసున్నాము  అని  అన్నారు  అంతకు  ముందు  రోడ్డు పై పోదాం అన్న  భయం పొలం వద్దకు  వెళ్దాంమన్నా వానరాల తో  విపరీతంగా  భయం గా ఉండేది  ఇప్పుడు  బాధా  తప్పిపోయినది ప్రజలు  అంటున్నారు. సమిష్టి  సహకారం తో నే  చేసుకుంటు న్నా మని  గ్రామ  సర్పంచ్ ఎడబోయిన రాజు అన్నారు.  సకాలి  దసారం , వనం  సత్యం ,  రోజు,ఉదయం  , సాయంత్రం    కొండెంగలను త్రిప్పుతు  పాడైన  కూరగాయలు ,  ఏవి  అయినా  పాడవెయ్యద్దు కొండెంగలకు  ఎయ్యాలని  వారు  అన్నారు ,  గ్రామం లో   ఆడుతూ  పడుతూ కొండెంగ లను పట్టుకొని   ఇద్దరు సంతోషం గా  తిరుగుతు , నర్మాల గ్రామస్తులు పాలక వర్గం  సభ్యులు  పెద్ద లు వారికీ ఎంతగానో కృతజ్ఞతలు  తెలిపారు.

కెకె రాజు ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ

 కెకె రాజు ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

జీవీఎంసీ ఎన్నికల్లో  వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించిన శుభసందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు ఆధ్వర్యంలో సోమవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద నుండి నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో విజయోత్సవ భారీ బైక్ ర్యాలీ  నిర్వహించారు.

 ఈ ర్యాలీ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి నియోజకవర్గ పరిధిలో  గల బి ఎస్ లేఔట్, సీతమ్మధార, సత్యం జుంక్షన్, గురుద్వార్ , సీతమ్మపేట, లలితానగర్, అక్కయ్యపాలెం మహారాణి పార్లర్, 80 ఫీట్ రోడ్, తాటిచెట్ల పాలెం, కంచరపాలెం, ఊర్వశి, మర్రిపాలెం, ఆర్ అండ్ బి, దగ్గర మారియట్ హోటల్, మాధవదార మురళీనగర్ ఎన్ జి జి ఓ యస్ కాలనీ,పట్టాభిరెడ్డి గార్డెన్, పోలీటెక్నికల్ కాలేజ్, ఊర్వశి హైవే, తాటిచెట్లపాలెం హైవే , కైలాస పురం, గణేష్ నగర్, నరసింహనగర్, ఉత్తర నియోజకవర్గ కార్యాలయం వరకు  విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో కె కె రాజు తో పాటు నియోజకవర్గ పరిధిలోని కొర్పొరేటర్ లు,వార్డు అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.

దాతృత్వం చాటుకున్నా యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు

 దాతృత్వం చాటుకున్నా యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు

 లక్షెట్టిపెట్, పెన్ పవర్

మండలంలోని మిట్టపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ముత్యంపేట్ గ్రామానికీ చెందిన యువరాజ్యం స్వచ్చంధ సేవా సంస్థ వ్యవస్థాపకులు గొర్రె రామ్ లక్ష్మణ్ లు దాతృత్వం చాటుకున్నారు.ముత్యంపేట్ గ్రామంలో గల పోచమ్మ అలయంకు తమ సొంత ఖర్చులతో పదహారు వేల నూట పదహరు రూపాయలతో బాగుచేసి తమలో భక్తీ భావం ఉందని నిరూపించుకున్నారు.ఆలయంకి రంగులు వేయించారు.గతంలో నుంచి రామ్ లక్ష్మణ్ లు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.ఆలయం చుట్టూ రంగులు వేయించి దేవతా మూర్తుల చిత్రలను అందంగా వేయించారు.ఆలయం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి విద్యుత్ స్థంభం ఏర్పాటు చేసి ఆలయంలో ఆలయం చుట్టూ  విద్యుత్  బల్బులను ఏర్పాటు చేసి మానవత్వం చాటుకున్నారు.ఇలాంటి మంచి సేవ కార్యక్రమాలు చేస్తున్న రామ్ లక్ష్మణ్ ని పలువురు అభినందించారు.

హక్కుల పై అవగాహన పెంచుకోవాలి

 హక్కుల పై అవగాహన పెంచుకోవాలి

రామకృష్ణాపూర్,  పెన్ పవర్ 

వినియోగదారుల హక్కుల రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని ఆరోగ్య హక్కు వేదిక అధ్యక్షులు న్యాయవాది రాజలింగు మోతె అన్నారు. సోమవారం అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా వినియోగదారుల హక్కులు, రక్షణ చట్టాలు ముద్రించిన కరపత్రాలను రామకృష్ణ పూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ లో పంపిణీ చేస్తూ, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్షులు మాట్లాడుతూ, వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని పలు సంస్థలు, వ్యక్తులు వివిధ రకాలుగా మోసాలకు గురిచేస్తున్నారని, హక్కుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా నిత్యం ఏదో ఒకచోట మోసానికి గురౌతున్నారని అన్నారు. కొనే ప్రతీ వస్తువులోనూ, సేవలోనూ లోపం లేకుండా సరైన ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత కలిగినవి పొందే హక్కు వినియోగదారులకు ఉంది. కానీ ప్రస్తుత కాలంలో మోసాలు ఎక్కువై పోతున్నాయని పేర్కొన్నారు. త్రాగే పాల నుండి ప్రతీది కల్తే. వినియోగదారుడు మార్కెట్ లో ఏది కల్తీ నో,నకిలీ నో ,ఏది నాణ్యమైనదో గుర్తించ లేక పోతున్నారని అన్నారు. ఈ తరహా మోసాల నుండి వినియోగదారుడు తనను తాను రక్షించు కొనేందుకు ఏ వస్తువు కొన్నా రశీదు తీసుకోవాలని సూచించారు. ఏ తరహా మోసం నుంచయినా వినియోగదారులకు అది కవచంలా ఉపయోగపడుతుందని తెలిపారు. గుండుపిన్ను కొన్నా రశీదు తీసుకోవడం మరువద్దని అన్నారు. ఒకవేళ వినియోగదారుడు నష్టపోయి నప్పుడు సత్వర న్యాయం, నష్ట పరిహారం పొందేందుకు ఇదే ఆయుధ మౌతుందన్నారు. ఈ కార్యక్రమంలో  పట్టణ నాయకులు సంపత్, శ్రీనివాస్, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సంకె శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలి

 సంకె శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలి  సిఐటియు

మందమర్రి, పెన్ పవర్ 

రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా శనివారం వేలాల వద్ద గోదావరి నదిలో సంకె శ్రీనివాస్ మరణించడం జరిగిందని అతని కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్ల ద్వారా టెండర్లు వేస్తూ లక్షల రూపాయలు ఆర్జించారని, గోదావరి నదిలో ఇసుక తీసే క్రమంలో 15 నుండి 20 ఫీట్ల లోతు వరకూ ఇసుక తీయడం వలన, నదిలో గుంతలు ఏర్పడి, తెలియక నదీ స్నానానికి వెళ్లిన శ్రీనివాస్ చనిపోవడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి శ్రీనివాస్ భార్య, మానసిక వికలాంగులైన అతని పిల్లలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఏరియా అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్, రాష్ట్ర నాయకులు రామగిరి రామస్వామి, నాయకులు ఐలయ్య, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...