Followers

క్రీడల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలి

 క్రీడల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలి

కాంగ్రేస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ




లక్షెట్టిపెట్, పెన్ పవర్

క్రీడల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కాంగ్రెస్ పార్టీ డిసిసి అద్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు.పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం కొక్కిరాల రఘుపతిరావు మెమోరియల్ చారిటేబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ యువతను క్రీడల్లో ప్రోత్సహించాలని మండలాల వారిగా ఈ టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.లక్షెట్టిపెట్ మండలంలో మొత్తం ముపైఅరు టీంలు పోటీలో పాల్గొంటున్నారని ప్రతిభ కనబర్చిన వాళ్లలో మొదటి బహుమతి డెభై ఐదువేలు, ద్వితీయ బహుమతి నలభై వేలు, మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు.పట్టుదలతో తారతమ్యాలు లేకుండా స్నేహపూర్వకంగా ఆడి విజయం సాదించాలని కోరారు.అనంతరం టాస్ వేసి పావురాలను గాలిలోకి వదిలి క్రికెట్ పోటీని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి అన్నంమంగ,జడ్పీటిసి ముత్తె సత్తయ్య,మున్సిపల్ ఫ్లోర్ మెంబర్ చెల్ల నాగభూషణం, కౌన్సిలర్లు చింత సువర్ణ,రాందేని వెంకటేష్,అరిఫ్, సత్తవ్వ,నాయకులు,చింత అశోక్,ఆయిల్లా విజయ్ కుమార్,పెండం శ్రీలత,ముజ్జు,నవాబ్, శ్రీదర్,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.


అమరజీవి త్యాగం తెలుగు ప్రజల కు స్ఫూర్తి

 అమరజీవి త్యాగం తెలుగు ప్రజల కు స్ఫూర్తి 


 పెద్దాపురం,పెన్ పవర్

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు ప్రజలకు స్ఫూర్తి నిస్తుం దని ఆర్డీవో ఎస్. మల్లిబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి  రెవిన్యూ డివిజనల్ అధికారి ఎస్ మల్లిబాబు పూలమాలవేసి  నివాళులు అర్పించారు.అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ  తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు  ఆమరణ నిరాహార దీక్ష చేసి  అమరుడైన మహోన్నత వ్యక్తిని  కొనియాడారు, ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ  నిర్వహణ అధికారి ఇంచార్జ్ రామ్కుమార్,డిప్యూటీతాసిల్దారు భాను కార్యాలయసిబ్బంది తదితరులు నివాళఅర్పించినవారిలోఉన్నారు.అదేవిధంగాపెద్దాపురంమండలప్రజాపరిషత్కార్యాలయంలోనూ ఎంపీడీవో  రమణ రెడ్డిపొట్టిశ్రీరాములుచిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

పారదర్శకంగా/ కౌన్సిలింగ్ ద్వారా మంచిర్యాల జిల్లా సివిల్ పోలీసు సిబ్బంది బదిలీలు

 పారదర్శకంగా/ కౌన్సిలింగ్ ద్వారా మంచిర్యాల జిల్లా సివిల్ పోలీసు సిబ్బంది బదిలీలు 



మంచిర్యాల ,  పెన్ పవర్

రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో  రామగుండం  కమీషనరేట్ పరిధిలో పనిచేయుచున్న మంచిర్యాల జిల్లా సివిల్ సిబ్బంది ఏఎస్ ఐ /హెడ్ కాన్స్టేబుల్ /కానిస్టేబుల్ మొత్తం 61మంది సిబ్బందికి పోలీస్ కమిషనర్  వి.సత్యనారాయణ ఐపిఎస్  కౌన్సిలింగ్ నిర్వహించి, వారి స్యమస్యలు అడిగి తెలుసుకొని కమీషనరేట్ మంచిర్యాల జిల్లా పరిధిలో  కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇచ్చారు.అనంతరం సిపి  మాట్లాడుతూ అధికారులతో సమన్వయంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించి ప్రజలతొ మంచి సత్ససంబందాలను ఏర్పాటు చేసుకుని,  ప్రతి ఒక్కరూ నిజాయితీతో పనిచేసి  పోలీస్ డిపార్ట్ మెంట్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  డిసిపి మంచిర్యాల ఉదయ్ కుమార్ అడిషనల్ డిసిపి ఏఆర్ కమాండెంట్  సంజీవ్, సుందర్ రావు,ఏసీపీ ట్రాఫిక్ బాలరాజు,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు నారాయణ, సతీష్,ఇన్స్పెక్టర్ లు ప్రవీణ్ కుమార్,బాబు రావు, కుమారుస్వామి,ఆర్ ఐ లు మధుకర్,అనిల్,శ్రీధర్, విష్ణు,సీపీఓ సిబ్బంది సూపరిండెంట్ శ్రీనివాస్,సీనియర్ అసిస్టెంట్ పోతారాజు రామగుండం పోలీస్ సంఘము అధ్యక్షులు పోచలింగం పాల్గోన్నారు.

ఆత్మహత్య చేసుకుంటానని ప్రభుత్వ ఆసుపత్రి పైకి ఎక్కి బెదిరింపు

 ఆత్మహత్య చేసుకుంటానని ప్రభుత్వ ఆసుపత్రి పైకి ఎక్కి బెదిరింపు


మంచిర్యాల ,  పెన్ పవర్

 మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి భవనం పైకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని ఓ గంట పాటు బెదిరింపులకు పాల్పడ్డాడు. మంగళవారం భార్య భర్తల గొడవల వల్ల  పోలీసులు సహకరించాలని కోరుతూ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ సృష్టించాడు. మంచిర్యాలలోని హమాలివాడ చెందిన పసుపులేటి శేఖర్ . వివరాల్లోకి వెళితే తన భార్య తనకు మధ్య మనస్పర్ధలు , గొడవలు జరగడంతో పసుపులేటి శేఖర్ ప్రభుత్వాసుపత్రి పైకి ఎక్కి కిందికి దూకుతానని బెదిరింపుకి పాల్పడ్డాడు.అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ భూపతి రెడ్డి సమయస్ఫూర్తి తో వ్యవహరించి  శేఖర్ భార్య ఫోన్లో మాట్లాడుతుందని చెప్తూ నీతో మాట్లాడుతది అంటూ మాటల్లో పెట్టి కిందికి లాగేసాడు. కాగా ఎస్ఐ ప్రవీణ్ బాధితుడు శేఖర్ ను పోలీస్ స్టేషన్ కు అదుపులో కి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.దీంతో గంటపాటు హైరానాపడ్డ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

మండల పరిషత్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి

 మండల పరిషత్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి

 పెన్ పవర్,ఆత్రేయపురం

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎంపీడీవో నాతి బుజ్జి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ ఉనికి లేకుండా ఉమ్మడి మద్రాసు లో తెలుగు వారికి ఒక ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని పోరాడి అందుకోసం ఆమరణ నిరాహార దీక్షలో తన ప్రాణాలు వదిలిన అమరజీవి ఆంధ్ర అవతరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి త్యాగమూర్తి ఆయన చిరకాలం తెలుగు ప్రజల గుండెల్లో ఉంటారు అని ఆమె  కొనియాడారు ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాధికారి శ్రీనివాస్ కార్యాలయ సిబ్బంది భాగ్యలక్ష్మి. వల్లి  విద్యా శాఖ సిబ్బంది కార్యదర్శులు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఎంపీడీవో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని సచివాలయ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగినది.

వధూవరులను ఆశీర్వదించిన ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ దంపతులు

 వధూవరులను ఆశీర్వదించిన ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ దంపతులు


ఆదిలాబాద్,  పెన్ పవర్

 ఉట్నూర్ మండలం లోని తాంధ్ర గ్రామంలో గోవింద్- సరిత, బేల మండలంలోని ఖరా గ్రామంలో సిడం శ్యామ్రావ్- లక్ష్మీ నుతన వధూవరులను  మంగళవారం  ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా - పవన్ రావు దంపతులు పెళ్లి శుభకార్యంలో పాల్గొని   స్థానిక జెడ్పిటిసి సభ్యురాలు చారులత రాథోడ్, టిఆర్ఎస్ నాయకులతో కలిసి వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం విందు భోజనం చేశారు. సుఖ సంతోషాలతో వందేళ్లు కలిసిమెలిసి ఉండాలని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు జంగు,  స్థానిక సర్పంచ్ గంగుబాయి తదితరులు పాల్గొన్నారు.

కరోనా నిబంధనలు పాటించని "మార్టిన్స్" పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి

 కరోనా నిబంధనలు  పాటించని "మార్టిన్స్"  పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి

 ...జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేత 

మంచిర్యాల , పెన్ పవర్

భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖధికారి కార్యాలయంలోని డీ ఈ ఓ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా ఎస్ ఎఫ్ ఐ   జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడితూ మంచిర్యాల జిల్లా లోని సిసిసి కార్నర్లో  ఉన్న మార్టిన్స్ అను ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు  పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆరో తరగతి నుంచి తరగతులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మాత్రం ఎల్కేజి,నుంచి 5తరగతి వరకు తరగతులు నడిపిస్తూ  ఒకే గదిలో 30 నుంచి 40 మందిని కూర్చోబెట్టి తరగతులు బోధిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు సిబ్బందికి కరోనా  వస్తుందన్నారు. ఇలాంటి సమయంలో జాగ్రత్తలు పాటించకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మార్టిన్స్ పాఠశాల యొక్క గుర్తింపు రద్దు చేయాలని, ఫీజుల పేరుతోటి విద్యార్థులను వారి తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తూ  అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రైవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని  భారత విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి సంఘం గా డిమాండ్ చేస్తున్నామని, లేనియెడల జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  నాయకులు పవన్ కళ్యాణ్,శ్రీనివాస్, అజయ్ పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...