Followers

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలి...

 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలి...

 కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లఖాన్

బేలా,  పెన్ పవర్

రైతుల పక్షాన వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ నేడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక పంజాబ్ చౌరస్తాలో శనగ కొనుగోలు చేపట్టాలని నిరసన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లఖాన్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు రాందాస్ నాక్లే, అన్నారు మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రైతుల మద్దతు కోసం రాష్ట్ర వ్యాప్తంగా శానగా కొనుగోలు చేపట్టాలని నిరసిస్తూ చేపట్టే ధర్నాను మండలం నుంచి అధిక సంఖ్యలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు విలాస్ సవాపురే,వామన్, రూప్ రావు,ఘన్ శ్యామ్,  తదితరులు పాల్గొన్నారు.

జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన అధికారి వసుంధర

 జిల్లాలో  క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం. 

 జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన అధికారి వసుంధర

పెన్ పవర్,విశాఖపట్నం

 క్షయ పారిపోతుంది- దేశం గెలుస్తుంది  అన్న నినాదంతో రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా క్షయ వ్యాధి  నిర్మూలనా అధికారి డాక్టర్ ఎన్. వసుందర అన్నారు. మంగళవారం ఆమె  ప్రకటన విడుదల చేశారు. క్షయ పారిపోతుంది  దేశం గెలుస్తుంది  అనే నినాదం ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ప్రభుత్వాలు కాలు జారీ చేశాయని ఆ మేరకు  చర్యలు చేపట్టామన్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు గ్రామాల్లో క్షయ వ్యాధి పట్ల  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు క్షయవ్యాధిని సమూలంగా నివారించాలని తగిన చర్యలు తీసుకోవడానికి ప్రజలు సహకరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో క్షయ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది  అన్న అంశాన్ని ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. క్షయ వ్యాధి నిర్మూలన శాఖ అధికారులు సిబ్బంది రెండు వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని వసుంధర తెలిపారు.

చలి వేంద్రముని ప్రారంభించిన జోనల్ కమిషనర్

 చలి వేంద్రముని ప్రారంభించిన జోనల్ కమిషనర్


కూకట్ పల్లి,పెన్ పవర్ 

యోగ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమని కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కూకట్ పల్లీ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని యోగ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలుగా ఆయుర్వేద విద్యా, ఆహార విద్యా, యోగా నేర్పించడమే కాకుండా సమాజ సేవలో భాగంగా ప్రతిరోజు పలు ఆసుపత్రులు తిరుగుతూ సుమారు 700 మందికి పైగా ఆహారం అందజేస్తున్న జగన్ గురుజిని అభినందించారు. జగన్ గురూజీ మాట్లాడుతూ కరోనా సమయంలో అరవై రోజుల పాటు రోజు రెండు వేల మందికి ఆహారం అందజేయడం జరిగిందని, అదే సేవ దృక్పథంతో మూడు నుండి నాలుగు నెలల పాటు బాలానగర్ చౌరస్తా నుండి మియాపూర్ చౌరస్తా వరకు మజ్జిగ, నిమ్మరసం, ఫ్రూట్ జ్యూస్ వంటి పానీయాలను రహదారుల వెంబడి సంచరిస్తూ ఉచితంగా అందచేస్తామని, తమ సంస్థ ఆధ్వర్యంలో నిత్యం సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగుతాయని వారు తెలియజేశారు. డిప్యూటీ కమిషనర్లు మాట్లాడుతూ ఇలాంటి మంచిపని చేయడం ఎంతో హర్షదాయకమని, నిరంతరం ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే తమ సిబ్బందికి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతయని,  భవిష్యత్తులో ఈ సంస్థ మరిన్ని సేవలు చేస్తూ ముందుకు వెళ్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో డిప్యుటీ కమీషనర్లు రవికిరణ్, ప్రశాంతి, హెల్త్ ఆఫీసర్లు చంద్రశేఖర్, సంపత్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

“శ్రీ రామదాస్ పేపర్ మిల్ సందర్శించిన ఆదిత్య బిజినెస్ స్కూల్ విద్యార్థులు”

శ్రీ రామదాస్ పేపర్ మిల్  సందర్శించిన ఆదిత్య బిజినెస్ స్కూల్ విద్యార్థులు

గండేపల్లి,పెన్ పవర్

   గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాప్రాంగణం నందు గల      ఆదిత్య బిజినెస్ స్కూల్ నందు  బి.బి.ఎ, మొదటి  సంవత్సరం    చదువుచున్న  విద్యార్థులు తూర్పుగోదావరి జిల్లా  కడియం లో గల  "శ్రీరామదాస్ పేపర్ మిల్"  ను    సందర్శించినట్లు ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ డా. ఎన్. సుగుణారెడ్డి  తెలియజేసారు. విద్యార్థులు అందరూ ఈ క్షేత్ర పరిశీలనను సంతృప్తి కరంగా ముగించి తద్వారా పొందిన జ్ఞానాన్ని భవిష్యత్ లో వ్యాపార పారిశ్రామిక రంగాలలో అన్వయించుకొని ఉజ్జ్వల మైన ప్రగతికి బాటలు వేసుకోవాలని ఆమె అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో  విద్యార్థులు రాణించాలంటే పుస్తక పఠనాజ్ఞానమే కాకుండా ఇటువంటి స్వయం అవగాహన జ్ఞానం (క్షేత్ర పరిశీలన)ఎంతో దృఢమైన ముద్ర విద్యార్థుల మస్తిష్కాలలో వేస్తుందని అన్నారు. విద్యార్థులకు ఇటువంటి  పారిశ్రామిక సందర్శనలు  వలన క్షేత్ర స్థాయిలో రోజువారీ కార్యక్రమాలు విపులంగా తెలుసుకొని అవగాహన చేసుకొనేందుకు ఎంతగానో తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు.  విద్యార్థులు ఆంగ్లభాషా పరిజ్ఞానం పెంపొందించుకోవాలని డా. సుగుణారెడ్డి సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. ఆస్ధాశర్మ మాట్లాడుతూ విద్యార్థులు ప్రత్యక్ష పరిశీలనతో మరింత విశ్లేషణాత్మక జ్ఞానం పొందడానికి  ఈ కార్యక్రమం దోహద పడుతుందని, విద్యార్థులు  తాము ఎంచుకొన్న మార్గంలో ప్రణాళికా బద్దంగా చదవడం ద్వారా లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫాకల్టీ  వి.అప్పలకొండ, శ్రీమతి రేణుక, విద్యార్థులు పాల్గొన్నారు.

తహశీల్దార్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

 తహశీల్దార్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

తాళ్ళపూడి, పెన్ పవర్

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని మంగళవారం తాళ్ళపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి తహసీల్దార్ ఎం.నరసింహమూర్తి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం.నరసింహమూర్తి మాట్లాడుతూ తొలిభాషా ప్రయుక్త రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన మహనీయుడని, వారి త్యాగనిరతిని గుర్తుంచుకొని, వారిని ఆంద్రులు స్మరిస్తూ ఉండాలని అన్నారు. అనంతరం ఏఎస్వో జోడాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1901 మార్చి 16 వ తేదీన మద్రాసు లోని జార్జ్ టౌన్ అణాఫిల్లే వీధిలో  165 వ నెంబర్ గల ఇంట జన్మించి, ఉప్పుసత్యాగ్రహం, క్విట్టిండియా ఉద్యమాల్లో పాల్గొని, హరిజనోద్దరణకు కృషి చేశారని తెలిపారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 50 రోజులు పైగా ఆమరణ నిరాహారదీక్ష చేసి డిసెంబర్ 15 అర్థరాత్రి 1952 లో తన ఆశయ సాధన కోసం అమరుడు అయ్యాడని, వారి త్యాగనిరతికి ప్రతీకగా డిసెంబర్ 19, 1952 లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రకటన చేశారని తెలిపారు. ఆయన అమరజీవి అయిన 126 వ నెంబర్ గల ఇంటిని అయన స్మృతి చిహ్నం గా మద్రాసులో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడుచున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిటి రాజాబాబు, ఆర్ ఐ క్రాంతిరేఖ, సీనియర్ అసిస్టెంట్ సత్యేంద్ర కుమార్, జూనియర్ అసిస్టెంట్ ఎ.ప్రభుకుమార్, విఆర్వో లు ప్రకాష్, రవి, కమల్, ప్రవీణ్, లీలావతి, నరేష్, స్వర్ణ, విఆర్ఎ లు సురేష్, ఉమ, శ్రీలక్ష్మి, భాగ్యలక్ష్మి, కంప్యూటర్ ఆపరేటర్ బాబీ, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

క్రీడల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలి

 క్రీడల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలి

కాంగ్రేస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ




లక్షెట్టిపెట్, పెన్ పవర్

క్రీడల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కాంగ్రెస్ పార్టీ డిసిసి అద్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు.పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం కొక్కిరాల రఘుపతిరావు మెమోరియల్ చారిటేబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ యువతను క్రీడల్లో ప్రోత్సహించాలని మండలాల వారిగా ఈ టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.లక్షెట్టిపెట్ మండలంలో మొత్తం ముపైఅరు టీంలు పోటీలో పాల్గొంటున్నారని ప్రతిభ కనబర్చిన వాళ్లలో మొదటి బహుమతి డెభై ఐదువేలు, ద్వితీయ బహుమతి నలభై వేలు, మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు.పట్టుదలతో తారతమ్యాలు లేకుండా స్నేహపూర్వకంగా ఆడి విజయం సాదించాలని కోరారు.అనంతరం టాస్ వేసి పావురాలను గాలిలోకి వదిలి క్రికెట్ పోటీని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి అన్నంమంగ,జడ్పీటిసి ముత్తె సత్తయ్య,మున్సిపల్ ఫ్లోర్ మెంబర్ చెల్ల నాగభూషణం, కౌన్సిలర్లు చింత సువర్ణ,రాందేని వెంకటేష్,అరిఫ్, సత్తవ్వ,నాయకులు,చింత అశోక్,ఆయిల్లా విజయ్ కుమార్,పెండం శ్రీలత,ముజ్జు,నవాబ్, శ్రీదర్,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.


అమరజీవి త్యాగం తెలుగు ప్రజల కు స్ఫూర్తి

 అమరజీవి త్యాగం తెలుగు ప్రజల కు స్ఫూర్తి 


 పెద్దాపురం,పెన్ పవర్

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు ప్రజలకు స్ఫూర్తి నిస్తుం దని ఆర్డీవో ఎస్. మల్లిబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి  రెవిన్యూ డివిజనల్ అధికారి ఎస్ మల్లిబాబు పూలమాలవేసి  నివాళులు అర్పించారు.అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ  తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు  ఆమరణ నిరాహార దీక్ష చేసి  అమరుడైన మహోన్నత వ్యక్తిని  కొనియాడారు, ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ  నిర్వహణ అధికారి ఇంచార్జ్ రామ్కుమార్,డిప్యూటీతాసిల్దారు భాను కార్యాలయసిబ్బంది తదితరులు నివాళఅర్పించినవారిలోఉన్నారు.అదేవిధంగాపెద్దాపురంమండలప్రజాపరిషత్కార్యాలయంలోనూ ఎంపీడీవో  రమణ రెడ్డిపొట్టిశ్రీరాములుచిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...