ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలి...
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లఖాన్
బేలా, పెన్ పవర్రైతుల పక్షాన వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ నేడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక పంజాబ్ చౌరస్తాలో శనగ కొనుగోలు చేపట్టాలని నిరసన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లఖాన్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు రాందాస్ నాక్లే, అన్నారు మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రైతుల మద్దతు కోసం రాష్ట్ర వ్యాప్తంగా శానగా కొనుగోలు చేపట్టాలని నిరసిస్తూ చేపట్టే ధర్నాను మండలం నుంచి అధిక సంఖ్యలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు విలాస్ సవాపురే,వామన్, రూప్ రావు,ఘన్ శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.








