వై.ఎస్.ఆర్. భీమా చెక్కుల పంపిణీ
విశాఖ ద్వారకానగర్,పెన్ పవర్
చోడవరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వై.ఎస్.ఆర్. భీమా పథకానికి చెందిన లబ్ది దారులకు ప్రియతమ శాసనసభ్యులు శ్రీ కరణం ధర్మశ్రీ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా శాసన సభ్యులు ధర్మశ్రీ మాట్లాడుతూ జిల్లాలో అన్ని మండలాల్లో కల్లా చోడవరం నియోజకవర్గ మండలాలకు అత్యధికంగా ఈ పథకానికి గ్రాంట్లు కేటాయించారని సంతోషాన్ని వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం. డి. ఓ. శ్యామ్ సుందర్ , వై.ఎస్.ఆర్.సి.పి. ముఖ్య నేతలు బొడ్డు శ్రీరామ్మూర్తి , దొండా రాంబాబు , గొర్లె సూరిబాబు, చందూ రాంబాబు , మరియు చోడవరం , రావికమతం , రోలుగుంట , బుచ్చయ్యపేట గ్రామాల సర్పంచులు , పథకం లబ్ధిదారులు పాల్గొన్నారు .







రోగుల పరిస్థితితో పాటు ఆసుపత్రి లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు,సిబ్బందికి కూడా ఉక్కపోత తిప్పలు తప్పడం లేదు.వైద్య అధికారి గదిలోని కూడా ఏ.సీ పనిచేయకపోయినప్పటికి వాటి నిర్వహణకు నోచుకోవడం లేదు. ఇన్ని సమస్యలు కంటికి కనిపిస్తున్న ఆ సమస్యలను మాత్రం పట్టించుకోవడంలో అధికారులు ఎందుకు ముందుకు రావడం లేదో తెలియడం లేదు.ఆసుపత్రిలో ఇంజెక్షన్లు,డ్రెస్సింగ్స్ చేసే గదులను పరిశీలిస్తే లోపల నిర్వహణ పరిస్థితులు అద్దంపడతాయి. ఆసుపత్రి బయట మొక్కలతో చూడముచ్చటగా ఆహ్లాదకరంగా ఉన్నప్పటికి లోన మాత్రం సమస్యల ద్వారానికి కేరాఫ్ గా దర్శనమిస్తాయి.ఇంజెక్షన్ రూమ్ పైకప్పు నుండి నీరు కారుతూ ఉన్నా కనీసం మరమ్మత్తులకు నోచుకోని పరిస్థితిలో విధులను ముందుకు నడిపే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారం చూపుతారని ప్రజలు,ఆసుపత్రికి వచ్చిన రోగులు కోరుతున్నారు.