విద్యార్థి నిలతో వెట్టిచాకిరీ చేయించిన వార్డెన్,హెచ్. ఎమ్ లను సస్పెంసడ్ చేయాలి
పెన్ పవర్,విశాఖపట్నంవిశాఖ ఏజెన్సీస చింతపల్లి మండలం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలోని విద్యార్ధులతో ఈ నెల 12 రాత్రి,డ్రైనేజీ,పూడికతీత పనులు గిరి విద్యార్థినులతో చేయించింది ముమ్మాటికీ వాస్తవమేనని,ఆ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు,హాస్టల్ నిర్వాహకులు(ఏఛ్.డబ్ల్యూ.ఓ) వారికి విద్యార్థులతో అటువంటి వెట్టిచాకిరి పనులు చేయిపించకూడదని తెలియదా,లేక తెలిసి చేయిపిస్తున్నారా అని పాడేరు జి ఎస్ యు నాయకులు సుమన్ మండి పడ్డారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పాఠశాలలోని పిల్లల పనులను ఉద్దేశించి అలాగే పాఠశాల పరిశుభ్రత కొరకై వర్కర్లకు ఐటీడీఏ వారు నియమించి నెల,నెల జీతాలు ఇస్తున్నారు.అయిన విద్యార్థులతో పనులు చేయించడం ఏమిటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థులతో పనులు చేయించడం అనేది సరికాదని,చట్టరీత్యా నేరమని బాలల హక్కులకు భంగం కలుగుతుందన్నారు.అలాగే విద్యార్థినీలతో డ్రైనేజ్ పనులు చేయిపించడంలో వార్డెన్,ప్రధానోపాధ్యాయులు సిబ్బందికి ఇంకిత జ్ఞానం లేదా అని "గిరిజనవిద్యార్థి సంఘం"(జి ఎస్ యూ) జిల్లా అధ్యక్షులు బుడిదే సుమన్, సెక్రెటరీ బి.మాధవరావు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.వర్కర్లు లేనిపక్షంలో పాఠశాలలో బయట వ్యక్తులుతో 100,200 రూ.లు డబ్బులు పెట్టి డ్రైనేజ్ పనులు చేయించుకోవచ్చు అంతమాత్రాన వార్డెన్,ప్రధానోపాధ్యాయులు విద్యార్థినులతో డ్రైనేజీ పనులు చేయించడం ఎంత వరకూ సమంజసన్నారు.పాఠశాలలోని విద్యార్ధులు ముఖ్యంగా విద్యను అభ్యసించడానికి మాత్రమే తప్ప వెట్టిచాకిరి పనులు చేయడానికి కాదు.ఇది దుర్మార్గమైన పని కావున ఇటువంటి విషయాల పట్ల భావి భారత పౌరుడిగా సమాజంలో జరుగుతున్న సమస్యల, సంఘటనలపై అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం అతని తప్పేముందని అడుగుతున్నామన్నారు.ఈ విషయాల పట్ల చూస్తే మోకాళ్ళ వరకు బురదలో దించి దిగి విద్యార్థులు డ్రైనేజ్ పనులు చేయిస్తూన్న ప్రత్యక్షంగా వీడియో క్లిప్ ద్వారా మరియు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వార్తలు రావడం అబద్ధం అంటారా లేదా అభద్రతతో చేసినటువంటి వీడియోలు అంటారా అని అన్నారు. దీని విషయానికొస్తే గిరిజన విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఆ పాఠశాలలో జరిగినటువంటి సంఘటనలపై ఐటీడీఏ పీవో,డిడి వెళ్లి ఏం జరిగింది అనే విషయాల పట్ల సమగ్ర విచారణ జరిపి ప్రధానోపాధ్యాయులు వార్డెన్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు.అలాగే వీడియో మరియు ఫోటోలు తీసిన వ్యక్తిపై విద్యార్థుల తల్లిదండ్రులతో మరియు పిల్లల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ఇది ఎంతవరకు సమంజసమని అన్నారు.విద్యార్థుల సమస్యలను గుర్తించి చదువుకునే వయసులో పిల్లల చేత వెట్టిచాకిరి పనులు చేయిస్తున్నారని మంచి ఆలోచనతోనే పోస్టు అనేది అధికారుల దృష్టికి వెళ్లనే పెట్టినప్పటికీ,కిరాణా షాపు యజమానిపై తప్పుడు నిర్ణయాల మేరకు కేసు పెట్టడం మేము పూర్తిగా ఖండిస్తున్నామన్నారు.కావున పాఠశాలకు వెళ్లి నిజానిజాలు పరిశీలన చేసి విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా ఐటీడీఏ ప్రోజెక్టు అధికారికి మరియు సంబంధిత జిల్లా అధికారులకు మేము విన్నవించుకుంటున్నామన్నారు.ఈ విషయానికి వస్తే వార్డెన్ మరియు ప్రధానోపాధ్యాయులు పూర్తిగా తప్పు చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి సమగ్ర విచారణ చేపట్టి నిజనిర్ధారణ చేయవలసిందిగా ఐటిడిఎ పిఓకు గిరిజన విద్యార్థి సంఘం"జి.ఎస్.యు" తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జి ఎస్ యు నాయకులు, మాజీ అధ్యక్షుడు కిషోర్,జి.సాయినాథ్,ఎం.బాబుజ్జి,నాని ల్బాబు, ప్రభాకర్ బాలరాజు,శంకర్,కామరాజు కోటి తదితరులు పాల్గొన్నారు.