Followers

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాన్షీరామ్

 బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాన్షీరామ్

మందమర్రి,  పెన్ పవర్ 

కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టి ఎస్సీ, ఎస్సీ, బిసి, మైనార్టీ లను ఏకతాటి పైకి తీసుకు వచ్చిన మహోన్నత వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాన్షీరామ్ అని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పాత వీరాస్వామి, పట్టణ కన్వీనర్ మొయ్య రాంబాబు లు పేర్కొన్నారు. సోమవారం కాన్షీరామ్ 87 వ జయంతి పురస్కరించుకొని మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాన్షీరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంబేద్కర్, పూలే ల స్ఫూర్తితో బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కాన్షీరాం అని కొనియాడారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళితురాలైన మాయావతిని మూడుసార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం పట్టణ కో కన్వీనర్లు సకినాల శంకర్, నెరువట్ల శ్రీనివాస్, ఎండీ ఖలీముద్దీన్, నాయకులు చీర్ల సత్యం,బుంగ సురేందర్, అవునూరి పోశం, మార్త కుమారస్వామి, కనకం రవీందర్, నర్సోజి, దాసరి రాజనర్సు, ఉప్పులేటి నరేష్, జూపాక సంపత్, వాసాల సంపత్, మంతెన సుమన్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థి నిలతో వెట్టిచాకిరీ చేయించిన వార్డెన్,హెచ్. ఎమ్ లను సస్పెంసడ్ చేయాలి

విద్యార్థి నిలతో వెట్టిచాకిరీ చేయించిన వార్డెన్,హెచ్. ఎమ్ లను సస్పెంసడ్ చేయాలి

పెన్ పవర్,విశాఖపట్నం

విశాఖ ఏజెన్సీస చింతపల్లి మండలం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలోని విద్యార్ధులతో ఈ నెల 12 రాత్రి,డ్రైనేజీ,పూడికతీత పనులు గిరి  విద్యార్థినులతో చేయించింది ముమ్మాటికీ వాస్తవమేనని,ఆ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు,హాస్టల్ నిర్వాహకులు(ఏఛ్.డబ్ల్యూ.ఓ) వారికి విద్యార్థులతో అటువంటి వెట్టిచాకిరి పనులు చేయిపించకూడదని తెలియదా,లేక తెలిసి చేయిపిస్తున్నారా అని పాడేరు జి ఎస్ యు నాయకులు సుమన్ మండి పడ్డారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పాఠశాలలోని పిల్లల పనులను ఉద్దేశించి అలాగే పాఠశాల పరిశుభ్రత కొరకై వర్కర్లకు ఐటీడీఏ వారు నియమించి నెల,నెల జీతాలు ఇస్తున్నారు.అయిన విద్యార్థులతో పనులు చేయించడం ఏమిటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థులతో పనులు చేయించడం అనేది సరికాదని,చట్టరీత్యా నేరమని బాలల హక్కులకు భంగం కలుగుతుందన్నారు.అలాగే విద్యార్థినీలతో డ్రైనేజ్ పనులు చేయిపించడంలో వార్డెన్,ప్రధానోపాధ్యాయులు సిబ్బందికి ఇంకిత జ్ఞానం లేదా అని "గిరిజనవిద్యార్థి సంఘం"(జి ఎస్ యూ) జిల్లా అధ్యక్షులు బుడిదే సుమన్, సెక్రెటరీ బి.మాధవరావు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.వర్కర్లు లేనిపక్షంలో పాఠశాలలో బయట వ్యక్తులుతో 100,200 రూ.లు డబ్బులు పెట్టి డ్రైనేజ్ పనులు చేయించుకోవచ్చు అంతమాత్రాన వార్డెన్,ప్రధానోపాధ్యాయులు విద్యార్థినులతో డ్రైనేజీ పనులు చేయించడం ఎంత వరకూ సమంజసన్నారు.పాఠశాలలోని విద్యార్ధులు ముఖ్యంగా విద్యను అభ్యసించడానికి మాత్రమే తప్ప వెట్టిచాకిరి పనులు చేయడానికి కాదు.ఇది దుర్మార్గమైన పని కావున ఇటువంటి విషయాల పట్ల భావి భారత పౌరుడిగా సమాజంలో జరుగుతున్న  సమస్యల, సంఘటనలపై అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం అతని తప్పేముందని అడుగుతున్నామన్నారు.ఈ విషయాల పట్ల చూస్తే మోకాళ్ళ వరకు బురదలో దించి దిగి విద్యార్థులు డ్రైనేజ్ పనులు చేయిస్తూన్న ప్రత్యక్షంగా వీడియో క్లిప్ ద్వారా మరియు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వార్తలు రావడం అబద్ధం అంటారా లేదా అభద్రతతో చేసినటువంటి వీడియోలు అంటారా అని అన్నారు. దీని విషయానికొస్తే గిరిజన విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఆ పాఠశాలలో జరిగినటువంటి  సంఘటనలపై ఐటీడీఏ పీవో,డిడి  వెళ్లి ఏం జరిగింది అనే విషయాల పట్ల సమగ్ర విచారణ జరిపి ప్రధానోపాధ్యాయులు వార్డెన్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు.అలాగే వీడియో మరియు ఫోటోలు తీసిన వ్యక్తిపై విద్యార్థుల తల్లిదండ్రులతో మరియు పిల్లల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ఇది ఎంతవరకు సమంజసమని అన్నారు.విద్యార్థుల సమస్యలను గుర్తించి చదువుకునే వయసులో పిల్లల చేత వెట్టిచాకిరి పనులు చేయిస్తున్నారని మంచి ఆలోచనతోనే పోస్టు అనేది అధికారుల దృష్టికి వెళ్లనే పెట్టినప్పటికీ,కిరాణా షాపు యజమానిపై తప్పుడు నిర్ణయాల మేరకు కేసు పెట్టడం మేము పూర్తిగా ఖండిస్తున్నామన్నారు.కావున పాఠశాలకు వెళ్లి నిజానిజాలు పరిశీలన చేసి విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా ఐటీడీఏ ప్రోజెక్టు అధికారికి మరియు సంబంధిత జిల్లా అధికారులకు మేము విన్నవించుకుంటున్నామన్నారు.ఈ విషయానికి వస్తే వార్డెన్ మరియు ప్రధానోపాధ్యాయులు పూర్తిగా తప్పు చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి సమగ్ర విచారణ చేపట్టి నిజనిర్ధారణ చేయవలసిందిగా ఐటిడిఎ పిఓకు గిరిజన విద్యార్థి సంఘం"జి.ఎస్.యు" తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జి ఎస్ యు నాయకులు, మాజీ అధ్యక్షుడు కిషోర్,జి.సాయినాథ్,ఎం.బాబుజ్జి,నాని ల్బాబు, ప్రభాకర్ బాలరాజు,శంకర్,కామరాజు కోటి తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం

 ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం


కూకట్ పల్లి, పెన్ పవర్

ఇటీవల జరిగిన కూకట్ పల్లి కోర్టు ఎన్నికలలో గెలుపొందిన నూతన కార్యవర్గం సోమవారం కోర్టు ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా శాయేశ్వరా శర్మ, ప్రధాన కార్యదర్శిగా విజయశేఖర్ బాబు, జాయింట్ సెక్రటరీగా ఆదిత్యకుమార్, కోశాధికారిగా నటరాజ్, లైబ్రరీ సెక్రెటరీగా లత, స్పోర్ట్స్ సెక్రటరీగా భీమయ్య, కార్యవర్గ సభ్యులుగా శ్రీలత, శివప్రసాద్ గౌడ్, రాణి, సురేష్, రమేష్, కరుణ, దేవిధాస్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు రాజేశ్వర్ మాట్లాడుతూ న్యాయవాదులకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని, నూతనంగా నిర్మిస్తున్న కోర్టు పనులు తొందరగా సాగేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. జరిగిన ఎన్నికలలో అధికారులుగా విధులు నిర్వహించిన సుభాష్ గుప్తా, కాసిమ్ రాజ్, ప్రశాంత్ కుమార్ లు ఎన్నికల్లో గెలుపొందిన వారికి సర్టిపికెట్లను అందజేశారు.

నేలకొండపల్లి భీమ్ దీక్ష కార్యక్రమాన్ని టిజిపిఎ జెండా ఊపి ప్రారంభించారు

 నేలకొండపల్లి భీమ్ దీక్ష కార్యక్రమాన్ని టిజిపిఎ జెండా ఊపి ప్రారంభించారు 

 పెన్ పవర్,మరిపెడ 

బద్రాది కొత్తగూడెం

జిల్లా నేలకొండపల్లి లో జరిగే భీమ్ దీక్షలను విజయవంతం చేయాలని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ (టిజిపిఎ) భద్రాద్రి జోన్ కార్యదర్శి ఐనాల పరశురాములు అన్నారు. సోమవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో జండా ఊపి వాహనాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జ్ఞాన సమాజ నిర్మాణానికి భీమ్ దీక్షలు చేస్తున్నట్లు అక్షరం, ఆరోగ్యం, ఆర్ధికమె లక్ష్యం గా జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టిజిపిఎ అనుబంధ మహిళ జిల్లా అధ్యక్షురాలు తోట సుజాత,టిజిపిఎ జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు పరశురాములు, ఇమ్మడి వెంకటేశ్వర్లు, జిల్లా సహాయ కార్యదర్శి మాంకాళి గౌతమ్,టిజిపిఎ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ జిన్నా పవన్ కుమార్, అనుబంధ మహిళ జిల్లా సహాయకార్యదర్శి చిత్రాల శిరీష, టిజిపిఎ మరిపెడ మండల అధ్యక్ష, కార్యదర్శులు చింత వెంకన్న, ఐనాల వెంకన్న, నాయకులు మిడతపల్లి జగన్, జిన్నా అప్పయ్య, జినక సైదులు, జయమ్మ, బూబా, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ కి ఆజాది మహోత్సవ్ నిర్వహించే అర్హత లేదు...

 బీజేపీ కి ఆజాది మహోత్సవ్ నిర్వహించే అర్హత లేదు...

అనకాపల్లి,పెన్ పవర్

బీజేపీ కి ఆజాది మహోత్సవ్ నిర్వహించే అర్హత లేదు.ఆనాడు బ్రిటిష్ పాలన పై పోరాటం చేస్తే ఈనాడు కార్పొరేట్ కి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి.జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం.75 వ స్వాతంత్ర్య దినోత్సవాల లో భాగంగా కేంద్రం ఎంతో గొప్పగా ఆజాది అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్నారని, దేశాన్ని కార్పొరేట్ చేతులలోకి అప్పగిస్తున్న బీజేపీ కి ఆ అర్హత లేదని జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం విమర్శించారు. సోమవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆనాడు బావితరాల భవిష్యత్ కోసం ఎందరో మహానుభావులు పోరాటాలు చేస్తే వారి ప్రాణ త్యాగాలకు స్వాతంత్ర్య వచ్చిందని కానీ నేడు  వారి త్యాగాలను అవమానించేలా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థల కు కారు చౌకగా  అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నష్టాల్లో ఉన్న సంస్థల ను లాభాల బాట ఎలా తీసుకురావాలో ఆలోచనలు చేయకుండా కారు చౌకగా అంబానీ, అదాని లాంటి  కార్పొరేట్ దిగ్గజాల కు అప్పనంగా అమ్మేస్తున్నారని లాభాల్లో ఉన్న విమాన యాన, బ్యాంకింగ్, రైల్వే, ఎల్ ఐ సి, స్టిల్ ప్లాంట్, పోర్టులు, టెలికాం రంగ సంస్థలను ప్రైవేటీకరణ వైపు తీసుకు వెళ్తున్నారని విమర్శించారు. అన్నీ ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే రేపు మన భావితరాల భవిష్యత్ కార్పొరేట్ సంస్థల చేతిలో నలిగిపోవాల్సిందే అని ఆందోళన వ్యక్తం చేశారు. బానిస బతుకులకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న స్వాతంత్రాన్ని మళ్ళి ప్రైవేటీకరణ తో బానిస బతుకులు గా మారేందుకు బిజెపి ప్రభుత్వం మార్గాలను సుగమం చేస్తున్నాయని,ఇలాంటి దుర్మార్గపు చర్యలను నిరసిస్తూ యువతతో పాటు యావత్ భారతదేశం పిడికిలి బిగించి పోరాడాలని జై అనకాపల్లి సేన తరపున కొణతాల సీతారాం పిలుపునిచ్చారు.

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాణించాలి

 జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాణించాలి

విజయనగరం,పెన్ పవర్ 

విజయనగరం పట్టణంలోని గిరీశం పాఠశాలలో చదువుతూ, కరాటేలో విశేష ప్రతిభ కనబర్చి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్ధులను జిల్లా ఎస్పీ బి. రాజకుమారి మార్చి 15, సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్ లోని చండీఘర్ యూనివర్సిటీలో ఈ నెల 20 నుండి 26 వరకు జరగనున్న జాతీయ కరాటే చాంపియన్ పోటీలకు పట్టణంలోని గిరీశం పాఠశాల విద్యార్ధులు ఎం. రేవంత్ సుశీలాష్, వి. లక్ష్మీనారాయణలు ఎంపికైనట్లుగా గిరీశం పాఠశాల ప్రిన్సిపాల్ పి. ధనుంజయరావు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుండి నలుగురు విద్యార్ధులు ఎంపిక కాగా, వారిలో ఇద్దరు తమ పాఠశాలకు చెందిన విద్యార్ధులు ఉన్నారన్నారు. ప్రస్తుతం కోచ్ పి. సాగర్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్ధులు జిల్లా ఎస్పీ బి.రాజకుమారిని జిల్లా పోలీసు కార్యాలయంలో కలిసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి. రాజకుమారి విద్యార్ధులు ఎం. రేవంత్ సుశీలాస్, వి. లక్ష్మీ నారాయణలను అభినందించి,శుభాకాంక్షలు తెలిపారు. చండీఘర్ లో ఈ నెల 20 నుండి జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించి, విజయనగరం జిల్లాకు మంచి పేరును తీసుకొని రావాలన్నారు. గతంలో కూడా శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో కూడా ఈ విద్యార్థులు పాల్గొని, పతకాలను సాధించినట్లుగా పాఠశాల చైర్మన్ ఎ. ఏడుకొండలు జిల్లా ఎస్పీ బి. రాజకుమారికి తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, డిసిఆర్ బి సిఐ బి.వెంకటరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

స్వామి వారికి బంగారు కిరీటాన్ని సమర్పించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు

 స్వామి వారికి బంగారు కిరీటాన్ని సమర్పించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు

కూకట్ పల్లి,పెన్ పవర్

కూకట్ పల్లి వివేకానంద నగర్ కు చెందిన వడ్డేపల్లి నర్సింగ్ రావు కుమారుడు తిరుమల తిరుపతి దేవస్థానం హైదరాబాద్ లోకల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు, ఎల్.ఏ.సి మెంబర్ వడ్డేపల్లి రాజేశ్వరరావు తన తండ్రి జ్ఞాపకార్థం జూబ్లీహిల్స్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బంధుమిత్రులు, కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామి మందిరానికి వెళ్లి బంగారు కిరీటాన్ని స్వామివారికి సమర్పించారు. ఈకార్యక్రమంలో వై.వి.సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కుటుంబసభ్యులు, మరియు గోవిందహరి లోకల్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...