Followers

Showing posts with label GENERAL NEWS. Show all posts
Showing posts with label GENERAL NEWS. Show all posts

చేతులెత్తి మొక్కుతున్న వార్డ్ ప్రజలు ఇంట్లోనే వుండండి

 చేతులెత్తి మొక్కుతున్న వార్డ్ ప్రజలు ఇంట్లోనే వుండండి

గాజువాక, పెన్ పవర్

చేతులెత్తి మొక్కుతున్నాను దయచేసి మీరు అంత ఇంట్లోనే వుండండి అని గాజువాక జనసేన మహిళ నాయకురాలు రెయ్యి రత్న కోరారు.ఉదయం లేస్తే ఏమి వినాల్సివస్తుందో అని ఏ ఆత్మీయులని .కోల్పోవాల్సివస్తుంది ఏమో అని బాధ దయచేసి ప్రస్తుతం బయట పరిస్థితి భిన్నంగా ఉన్నాయి డబ్బు పలుకుబడి ఏవి కూడా పనిచేసే పరిస్థితి లేదు కోవిడ్ బారిన పడి ఎవరిని కోల్పోవాల్సివస్తుందో అని మనసు కలిచి వేస్తుంది. దయచేసి స్వచ్చందంగా మీకు మీరుగా భౌతిక దూరం స్వీయ నియంత్రణ మస్కలు ధరించడం శానిటేషన్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు దయచేసి మీకు మీరుగా ఇంట్లో వుండండి అత్యావరమైతే తప్ప బయటకి రాకండి ప్రాణము కన్న విలువ అయినది ఏది లేదు అని తెలియజేసుకుంటున్నాను అని అన్నారు.


నైతిక విలువలు కోల్పోతున్న ఆకుల

నైతిక విలువలు కోల్పోతున్న ఆకుల

ఛీ... నోరుమూయ్ అంటూ మహిళ పై విరుచుకుపడ్డ సిటీ కో ఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ
నాలాగ ఏ పేషెంట్ బాధితులు ఎవరూ ఇబ్బంది పడకూడదని మహిళ ఆవేదన...

రాజమహేంద్రవరం, పెన్ పవర్

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక దానవాయిపేటలో ఉన్న శ్రీ ఆదిత్య ఆసుపత్రిలో ఆకస్మికంగా పేషెంట్ ని వేరే హాస్పిటల్ కి ఎక్కడైనా తరలించుకోవాలని ముందుగానే చెప్తున్నాను అని ఆక్సిజన్ రావడం లేట్ అవ్వచ్చు ముందుగానే చెప్పడం మా బాధ్యత అంటున్న డాక్టర్లు మీకు టైం ఇస్తాం అవకాశం ఉంటే వేరే హాస్పటల్  తీసుకెళ్లొచ్చు అని చెప్పడం జరిగింది. దీనిమీద ఆకుల సత్యనారాయణహాస్పిటల్ వద్దకు చేరుకుని డబ్బులు శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు, ప్రాణం శాశ్వతం కాదు, డబ్బులు కట్టడం లేదు ప్రైవేట్ హాస్పిటల్ లో అటువంటి మాటలు మాట్లాడకూడదు అంటూ, ప్రభుత్వ హస్పిటల్ తీసుకెళ్లి పొండి అని సలహాలు ఇస్తూ సిటీ కో ఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడి మానసికంగా మహిళని ఇబ్బందులకు గురి చేశారు.ఈ ఆమె బాధపడుతూ మాట్లాడుతూ ఈ విషయం మీద మాకు వైద్యం కొనసాగించాలి అని లక్షలు లక్షలు డబ్భులు కట్టే జాయిన్ చేసుకున్నారు అని మాకు న్యాయం చేయాలని, ఒక రాజకీయ  నాయకుడు అయ్యుండి, అసభ్యంగా మాట్లాడి మమ్ములను 12 మంది పేషేంట్స్  వారు బందువులపై అసభ్యంగా మాట్లాడి,ఆయన కారును దురుసుగా డ్రై చేస్తూ మమ్ములను భయభ్రాంతులను చేశారు ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.


ఉత్తమ రైతుకు కోవిడ్ వ్యాక్సిన్

 ఉత్తమ రైతుకు కోవిడ్ వ్యాక్సిన్

తాళ్లపూడి, పెన్ పవర్

తాళ్లపూడి మండల రావూరుపాడు గ్రామ కాపు సంఘం ప్రెసిడెంట్, ఉత్తమ రైతు, జనసేన నాయకులు పుప్పాల సత్యనారాయణ గురువారం మలకపల్లి పిహెచ్సిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. పుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ రావూరుపాడు గ్రామ ప్రజలంతా కోవిడ్ నియంత్రణ నిబంధనలు పాటించాలని, అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రాకూడదని, బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, చేతులను ఎల్లప్పుడూ శానిటైజేషన్ చేసుకోవాలని తెలియజేశారు. ప్రతీ ఒక్కరూ కరోన నియంత్రణ నిబంధనలు పాటించినపుడే కరోనాను తరిమికొట్టగలమని అన్నారు.


నాటుసారాకు ఉపయోగించే 1200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

 నాటుసారాకు ఉపయోగించే 1200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

గోపాలపురం, పెన్ పవర్

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏలూరు, ఏఎస్పీ మరియు ఏసి వారి అదేశాలమేరకు పోలవరం ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మరియు తమ సిబ్బంది బుధవారం తనిఖీల్లో భాగంగా గోపాలపురం మండలం కొవ్వాడ ప్రోజెక్టు ఏరియా బుచ్చియ్యపాలెం గ్రామంలో నాటుసారా కు ఉపయోగించే 1200 లీటర్ల బెల్లం ఊట పట్టుబడింది. ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ పట్టుబడిన బెల్లం ఊటను తమ సిబ్బంది సహాయంతో ధ్వంసం చేసినట్లు తెలిపారు.

భవన నిర్మాణ కార్మికులకు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇవ్వాలి

భవన నిర్మాణ కార్మికులకు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇవ్వాలి

 


రాజమహేంద్రవరం,పెన్ పవర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ప్రస్తుతం అమలులో ఉన్న కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇవ్వాలని టీఎన్టీయుసీ జిల్లా అధ్యక్షులు నక్కా చిట్టిబాబు కోరారు.గురువారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారిపోతుందని, గత రెండేళ్ళుగా కార్మికులకు వరుస కష్టాలు వచ్చాయన్నారు. ముఖ్యంగా ఇసుక కొరత ఒక పక్క వేధిస్తుంటే మరో పక్కకరోనా లాక్ డౌన్ తో లక్షలాదిమంది కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. ప్రస్తుతం ఏదో విధంగా పని కల్పించుకుని పని చేసుకుంటుంటే కరోనా సెకండ్ వేవ్ అంటూ మళ్ళీ పాక్షిక కర్ఫ్యూ విధించారన్నారు. దీని వల్ల ఎక్కువగా నష్టపోయేది భవన నిర్మాణ కార్మికులేనని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు పనులు చేసే సమయంలో వాళ్ళు బయట తిరిగి కరోనా వ్యాప్తి జరిగే అవకాశం లేదన్నారు. కేవలం కార్మికులు ఆయా భవనాల్లో మాత్రమే పనులు చేస్తారని, అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ,శానిటైజర్ వినియోగిస్తూ పనులు చేసుకుంటారని, కనుక ప్రభుత్వం ఈ పాక్షిక కర్ఫ్యూ నుంచి భవన నిర్మాణ కార్మికులకు తప్పక మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే గత ఏడాది  కరోనా లాక్ డౌన్ కాలంలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి ఒక్కొక్కరికి రూ.10 వేలు ఆర్ధిక సాయం అందిస్తామన్న హామీని తక్షణం నెరవేర్చాలన్నారు. భవన నిర్మాణ కార్మికులందరినీ ఆదుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని,తక్షణం ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇవ్వడంతో పాటు రైతులకు, నేతన్నలకు,రజకులకు,దర్జీలకు ఇస్తున్న విధంగా భవన నిర్మాణ కార్మికులు అందరికీ ఏటా రూ.10వేలు ఆర్ధిక సాయం అందించాలని,ప్రధానంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డులో గత ప్రభుత్వాలు పెట్టిన స్కీములను తొలగించాలనే ఆలోచనను తక్షణం విరమించుకోవాలన్నారు. కార్మికుల సంక్షేమ స్కీములన్నింటినీ పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు.


కైవల్య రధాలను ఏర్పాటు చేసిన రామోహన రావు ఫౌండేషన్

 కైవల్య రధాలను ఏర్పాటు చేసిన రామోహన రావు ఫౌండేషన్ 

రాజమహేంద్రవరం, పెన్ పవర్

కరోనా మహామ్మారి రోజు రోజు కు విస్తరించి వ్యాధి బారిన పడి మృత్యువాత పడుతున్నవారు , కరోనా తో మృతి చెందిన వారి మృతదేహాలను తరలించడం లో పేదలకు,మధ్యతరగతి వారికి భారంగా మారుతున్న తరుణంలో కరోనా వ్యాధితో మృతి చెందిన వారి మృతదేహాలను ఉచితంగా స్మశానవాటికకు  తరలించేందుకు ఉపయోగించే " కైవల్య రధాలు" (వాహనాలు)ఏర్పాటు చేసేందుకు  పెద్ద మనస్సుతో రాజానగరం ఎమ్మెల్యే, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ముందుకు వచ్చారు.కోవిడ్ వ్యాధితో మృతి చెందిన వారి మృతదేహాలను ఉచితంగా సేవా భావంతో  తరలించేందుకు వినియోగించే రెండు వాహనాలను జక్కంపూడి రామోహన రావు ఫౌండేషన్ , రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పోరేషన్ సంయుక్త ఆద్వర్యంలో వాహనాలు వినియోగిస్తారు.రాజమహేంద్రవరం  మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సమక్షంలో బుధవారం జక్కంపూడి రామోహన రావు ఫౌండేషన్ సభ్యులు  ఎం.ఆర్.పట్నాయక్ ద్వారా మున్సిపల్ కార్పోరేషన్ ఎం.హెచ్.ఓ. డాక్టర్ మూర్తి, మేనేజర్ సి.హెచ్ శ్రీనివాస్ లు వాహనాలు ప్రారంభించారు.ఈ రెండు వాహనాలు  రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ తోపాటు రాజానగరం పరిధిలో మృతి చెందిన వారి మృతదేహాలను ఉచితంగా స్మశాన వాటికకు తరలించేందుకు వినియోగిస్తారని తెలిపారు.  మృతి చెందిన వారి బాదిత కుటుంబాల వారు మృతదేహాలను తరలించేందుకు జక్కంపూడి రామోహన రావు ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 9154622899ను సంప్రదించాలని కోరారు.


వేగేశ్వరపురం లో సోడియం హైపో క్లోరైట్ పిచికారి

వేగేశ్వరపురం లో సోడియం హైపో క్లోరైట్ పిచికారి

తాళ్లపూడి, పెన్ పవర్

బుధవారం వేగేశ్వరపురం  గ్రామంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉన్నందున  సోడియం హైపో క్లోరైట్ ను  సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురమారావు, పంచాయతీ సెక్రెటరీ  వెంకట్రాజు ఆధ్వర్యంలో గ్రామంలో వీధులన్నీ పారిశుద్ధ్య కార్మికులచే  పిచికారి చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది,  వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పరశురామారావు మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనవసరంగా ఎవరూ బయటకు రావద్దని, బయటకు వచ్చినప్పుడు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించి, మనల్ని, మనసమాజాన్ని కరోన బారినుండి కాపాడుకోవాలని తెలియజేశారు.


కరోన బారినుండి ప్రజలు బయటపడాలని ప్రార్థనలు

కరోన బారినుండి ప్రజలు బయటపడాలని ప్రార్థనలు

తాళ్లపూడి, పెన్ పవర్

పవిత్రమైన రంజాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ విందు కార్యక్రమం బుధవారం వేగేశ్వరపురం గ్రామంలో జరిగింది.  వేగేశ్వరపురం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ జిలాని  సచివాలయ సిబ్బంది సహాయంతో కోవిడ్ ఆంక్షల నియమావళి మరియు కోవిడ్ నియంత్రణ జాగ్రత్తలు పాటించి  గ్రామంలో ఉన్న 25 కుటుంబాల వారి ఇంటికి వెళ్లి ఇఫ్తార్ విందు అందజేయడం జరిగింది. వేగేశ్వరపురం గ్రామంలో ఉన్న ప్రజలందరూ కోవిడ్ బారినుండి బయటపడాలని ప్రార్ధన చేశారు.


ఉపాధి కూలీలు కోవిడ్ నిబంధనలు పాటించాలి

 ఉపాధి కూలీలు కోవిడ్ నిబంధనలు పాటించాలి

పెన్ పవర్ , రావులపాలెం

కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఉపాధి హామీ పథకం కూలీలు, సిబ్బంది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పనులు చేయాలని ఏపిఓ సత్యవతి సూచించారు. రావులపాలెం మండలం లక్ష్మీపోలవరం, పొడగట్లపల్లి గ్రామాల్లో జరుగుతున్న కాలువ పనులను గురువారం ఆమె పరిశీలించారు. కోవిడ్ నేపథ్యంలో ఉపాధి కూలీలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ఫీల్డ్ అసిస్టెంట్లు విజయకుమార్, వెంకటనాగేంద్ర పాల్గొన్నారు.


గిరిజన ‌ బంధువులను దూరం చేస్తున్న కరోనా

గిరిజన ‌ బంధువులను  దూరం చేస్తున్న కరోనా

చింతూరు,  పెన్ పవర్

గిరిజనుల్లో లో శుభకార్యాలు జరిగినా, అశుభ కార్యాలు జరిగినా ఒక పండుగ జరిగినా బంధువులందరూ పెద్ద ఎత్తున వేడుకకు రావడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో కరోనా కు గురై మృతి చెందిన గిరిజనుల కుటుంబాల వద్దకు బంధువులు ఎవరూ రాకపోవడం హృదయవిదారకమైన విషయం. చింతూరు మండలంలో ఇంచుమించు ప్రతి గ్రామానికి కరోనా సోకింది. ప్రతి గ్రామంలోనూ లాక్ డౌన్ విధించటం గ్రామంలో శానిటేషన్ చేయించటం సెక్రటరీల పని వంతు అయింది. 12:00 తర్వాత లాక్ డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  ఆజ్ఞలు జారీ చేసింది. గత రాత్రి  మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సోడి కాంతమ్మ (50) కరోనాతో చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందింది. కాంతమ్మ మృతదేహానికి  సంస్కారాలు చేయడానికి బంధువులు ఎవరూ రాలేదు. కాంతమ్మ మరిది కొడుకులు మరో వ్యక్తి అంతిమ సంస్కారాలు చేశారు. కరొన తీవ్రతరం కావడంతో ప్రతి ఒక్కరూ జంకుతున్నారు. అంతిమ సంస్కారాలు చేయడానికి తన సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇది హృదయ విదారక దృశ్యం.


చారిటీ సోసైటీ ఆధ్వర్యంలో 20 కుర్చీలు బహుకరణ

 చారిటీ సోసైటీ ఆధ్వర్యంలో  20 కుర్చీలు బహుకరణ

బిక్కవోలు, పెన్ పవర్

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామం బిక్కవోలు చారిటీ సొసైటీ మరియు గ్లోబల్ విజన్ హైస్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో స్కూల్ కరస్పాండెంట్ ఎం.జాన్ డీన్ మరియు ప్రధానోపాధ్యాయులు సత్యవాణి రంగంపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంగళవారం 15 కుర్చీలు పి.హెచ్.సి డాక్టర్ ఎం.కృష్ణ చైతన్య మరియు డాక్టర్ ఎం.పద్మ వీరికి అందించారు. అలాగే సింగంపల్లి ఉప కేంద్రం ఆరోగ్య కేంద్రానికి 5 కుర్చీలు బహుకరిందం జరిగింది అని డాక్టర్లు తెలిపారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు కీర్తిశేషులు ఎం.శామ్యూల్ రాజు పేదలకు ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తు చేసుకుంటాము అని,మా వెన్నంటే ఉంటూ,  ప్రోత్సహించే వారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం కుర్చీలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


శేషగిరి మరణం విద్యారంగానికి తీరని లోటు...

 శేషగిరి మరణం విద్యారంగానికి తీరని లోటు...

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

  నిరంతరం ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ నేత,యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోరెడ్ల శేషగిరి కరోనా తో అకాల మరణం చెందడం విద్యారంగానికి తీరని లోటని, ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శేషగిరి సామాజిక స్పృహ కలిగిన నాయకుడని, ఉపాధ్యాయుల సంక్షేమం  కోసం, కార్మిక వర్గాల హక్కుల కోసం,ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేశారన్నారు. గురజాడ అధ్యయన వేదిక పక్షాన పలు సామాజిక అంశాలపై చర్చా వేదికలు నిర్వహిస్తూ చైతన్యం కోసం కృషి చేశారన్నారు. ఇటీవల విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఉద్యోగ,కార్మిక సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుండి నడిపించారన్నారు. అంతే కాకుండా శేషగిరి విద్యారంగ విశ్లేషకునిగా నూతన జాతీయ విద్యా విధానం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఏ విధంగా నష్టపోతారనే వ్యాసం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారని కొనియాడారు. గతంలో యూటీఎఫ్ లో శేషగిరితో ఉద్యమ సహచరునిగా కలిసి పని చేసామని,అదేవిధంగా గత రెండున్నర దశాబ్దాలుగా  ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై జరిగిన అనేక ఐక్య పోరాటాల్లో కలిసి పాల్గొన్నామని సామల తన జ్ఞాపకాలను గుర్తు చేసారు. కామ్రేడ్ కోరెడ్ల శేషగిరి  మరణం  తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన మరణం రాష్ట్ర  విద్యారంగానికి, ఉపాధ్యాయ , ఉద్యోగ , కార్మిక ఉద్యమాలకు తీరని లోటని అభివర్ణించారు  ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సామల పేర్కొన్నారు.

హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ

 హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ

మెంటాడ, పెన్ పవర్ 

మెంటాడ మండలం లోని పలు గ్రామాల్లో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉందని పలువురు మండల ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయితీ సర్పంచులు ముందు జాగ్రత్త చర్యగా పారిశుద్ధ్య పనుల చేపట్టారు. ఇందులో భాగంగా పిట్టా డ గ్రామ సర్పంచ్ కాపరపు నాయుడు బాబు ఆధ్వర్యంలో వాణిజ గిరిజన గ్రామంలో  క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం గ్రామంలో అన్ని వీధుల్లో హైపో క్లోరైడ్ ద్రావనాలను పిచికారీ చేస్తూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టే చర్యలను చేపడుతున్నారు. సర్పంచ్ నాయుడు బాబు  మాట్లాడుతూ ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలని కోరారు. ప్రస్తుతం కరోనా రెండవ దశలో ఉందని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇంట్లో ఉన్న, అత్యవసర సమయాల్లో బయటికి వెళ్ళిన మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని ఆయన వివరించారు. ప్రస్తుతం మెంటాడ, చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టీకాలు, టెస్టుల్లో చేస్తున్నారని 45 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులకు టీకాలు వేయించుకోవాలని ఆయన తెలిపారు. గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


వేసవి తాపం తీర్చే తాటి ముంజులు వచ్చేశాయ్

 వేసవి తాపం తీర్చే తాటి ముంజులు వచ్చేశాయ్

అంతరిస్తున్న తాటి వనాలు తగ్గిన ముంజుల దిగుబడి

పెన్ పవర్,  విశాఖపట్నం

వేసవి కాలం వచ్చిందంటే ముంజు లేయ్- తాటి ముంజులు అన్న కేక వీధుల్లో వినిపిస్తుంటుంది. తాటి ముంజులు తట్టను మహిళలు నెత్తిన పెట్టుకొని  ఎండను సైతం లెక్కచేయకుండా తిరుగుతుంటారు. మంజులేయ్  అన్న కేక వినగానే ఏయ్- ముంజులు ఇలారా  అని పలిచి బేరమాడి మరి కొనుక్కొంటాం. వేడికి ఉపశమనం కలిగించే తాటి ముంజులు సేకరణ లో ఎంతో శ్రమ దాగి ఉంది. తాటి చెట్ల నుంచి లేత కాయలు  దించి కత్తితో వలుస్తారు.ముంజులు తీయడం లో జాగ్రత్త వహించాలి. లేకుంటే ముంజులు పగిలి నీరు పోతుంది. చెట్టు గీత  గాళ్లు నేర్పరి గా ముంజులు తీస్తారు. గ్రామీణ ప్రాంతాలకు పరిమితం అయిన తాటి ముంజులు ఇప్పుడు పట్టణాలకు పాకింది. చేరువలో  ఉన్న  గ్రామాల నుంచి  తాటి ముంజల ను  పట్టణాలకు తరలించి విక్రయిస్తున్నారు. మారికవలస  పిన గాడి   సబ్బవరం ప్రాంతాల చెట్ల కింద తాటి కాయలు రాశులు  ముంజులు తీసి విక్రయిస్తున్నారు. డిమాండ్ బట్టి  ముంజుల ధరలు పెరుగుతున్నాయి  గ్రామీణ ప్రాంతాల్లో డజను పాతిక రూపాయలు ఉంటే నగరంలో 50 రూపాయలకు పైనే. వేసవిలో చెట్టు గీత గార్లకు తాటి ముంజలు కాసులు  పండిస్తున్నాయి.  తాటి చెట్లు  అంతరించిపోతుం డంతో తాటి ముంజల  కొరత  వస్తుంది. తాటి ముంజులు కు పట్టణాల్లో గిరాకీ ఉండడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి తాటి కాయలు సేకరిస్తున్నారు. మైదాన ప్రాంతాలకు పరిమితమైన తాటి ముంజులు ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. మాడుగుల ప్రాంతం నుంచి పాడేరు కు. నర్సీపట్నం ప్రాంతం నుండి చింతపల్లి కి ఎస్. కోట నుండి అరకు కి తాటి ముంజులు సరపరా అవుతున్నాయి. దూరం పెరిగే కొద్దీ ముంజుల ధరలు చుక్కల నంటుతున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని తెలంగాణ జిల్లా ల్లొ తాటి కలఫకు మంచి గిరాకి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో తాటి చెట్లును వ్యాపార్లు రవాణా చేస్తున్నారు. మరి కొంత కాలానికి తాటి చెట్లు కనుమరుగై పోయే అవకాశం ఉంది.


కరోనా నిర్మూలనకు ఆటో ద్వారా ప్రసారం

 కరోనా నిర్మూలనకు ఆటో ద్వారా ప్రసారం

మెంటాడ, పెన్ పవర్ 

మండల కేంద్రం మెంటాడ అక్కడ అక్కడ కరోనా కేసులు నమోదు కావడంతో సర్పంచ్ రేగిడి రాంబాబు వినూత్న ప్రసారాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కరోనా పట్ల అవగాహన కల్పించడం కష్టతరం అని గ్రామములో ఆటో ఏర్పాటు చేసి ప్రసారానికి శ్రీకారం చుట్టారు. సర్పంచ్ రాంబాబు మాట్లాడుతూ కరోనా మహమ్మారి తీవ్రంగా ఉందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, బహుదూరం పాటించాలని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వము లాక్ డౌన్, 144 సెక్షన్ అమలు చేసిందని, ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కిరానా, టిఫిన్, పాన్ షాపులు తెరిచి ఉంటాయని ప్రతి ఒక్కరూ తమకు కు కావలసిన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని, స్వచ్ఛందంగా ప్రజలు ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా ప్రబంధములు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.


కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్న సర్పంచ్

కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్న సర్పంచ్ 

మెంటాడ, పెన్ పవర్

మెంటాడ మండలం, చింతలవలస గ్రామపంచాయతీ సర్పంచ్ కలిశెట్టి సూర్యనారాయణ, వైద్య ఆరోగ్య సిబ్బంది,  గ్రామ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి గురువారం కరోనా పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండి పరిసరాల, పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వారు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని,    ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరిస్తే మంచిదని వారు గ్రామస్తులకు సూచించారు. బహుదూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండాలని, అవసరమైతే మాస్కులు ధరించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రము నిర్లక్ష్యం చేసిన కరోనా మహమ్మారి మనపై దాడి చేస్తుందని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


పాడేరు ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలి

 పాడేరు ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలి

 పాడేరు,  పెన్ పవర్

 పాడేరు ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ వెంటిలేటర్లు అపరేటర్లు సిబ్బందిని తక్షణమే నియమించాలని, ఆదివాసి జేఏసి జిల్లా కన్వీనర్ రామారావు దొర , కో-కన్వీనర్: కూడ రాధాకృష్ణ బూడిద సుమన్ ,ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గురువారం వారు మాట్లాడుతూ ఏజెన్సీ 11 మండలాలకు ఏకైక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి పాడేరు లోనే ఉంది. నిత్యం వందలాది మంది వైద్యం పొందుటకు పాడేరు జిల్లా ఆస్పత్రికి వస్తూ ఉంటారు. అలాంటి ఆసుపత్రిలో పాడేరులో వైద్యం చేయవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ, ఇక్కడ సరైన సిబ్బంది లేక కెజిహెచ్ కు రిఫరల్ చేస్తూ ఉంటారు. దానివల్ల మార్గమధ్యంలోనే అనేక మంది చనిపోతున్నా ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆక్సిజన్ వెంటిలేటర్ అందక ఒక వ్యక్తి పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో గంట వ్యవధిలోనే మరణించిన పరిస్థితి ఉందని, తక్షణమే ఆదివాసీల ప్రాణాలు కాపాడుటకు ఆక్సిజన్ వెంటిలేటర్ సిబ్బందిని నియమించాలని, ఆదివాసి జేఏసి జిల్లా నాయకులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.


గజ గజ లాడిస్తున్న గజ రాజులు

 గజ గజ లాడిస్తున్న గజ రాజులు 

కూరగాయలు కోత కు వెళ్లిన మహిళ మృతి
పొలాల్లో కి వెళ్ళడానికి భయపడుతున్న రైతులు
నేటి కి ఆరుగురు మృతి 
ప్రభుత్వం రెండు కోట్లు కు పైగా నష్టపరిహారం చెల్లింపు
పదుల సంఖ్యలో ఫారెస్ట్ సిబ్బంది కి గాయాలు, వాహనాలు ధ్వంసం
మూడు ఏళ్లుగా ఇదే తంతు దొరకని  శాశ్విత పరిష్కారం

కురుపాం, పెన్ పవర్

కురుపాం నియోజకవర్గంలో లో ఏనుగులు ప్రవేశించి మూడు ఏళ్ళు పైగా అవుతుంది,కానీ నేటికీ శాశ్విత పరిష్కారం దొరకలేదు,గురువారం తెల్లవారుజామున కోమరడా మండలం పాత కల్లికోట గ్రామానికి చెందిన అల్లాడా అప్పమ్మా అనే మహిళ కూరగాయలు కోయడానికి వెళ్ళేరు,ఇమే పై ఒక ఏనుగు దాడి చేయడం తో ఆమె అక్కడ కు అక్కడే మృతి చెందింది, ఇమే మృతి తో మృతుల సంఖ్య ఆరు కు చేరింది,ఒక వైపు కరోనో మరో వైపు ఏనుగుల దాడులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,నాగావళి నది తీరం ఉండటం తో  పుష్కలంగా నీరు,జియ్యమ్మవలస కోమరడా మండలలో అరటి , చెరకు ,లాంటి పంటలు ఉండటం తో వాటికి ఆహారం కూడా ఇబ్బంది లేకుండా ఉండటం తో ఈ ప్రాంతం విడి పోవటం లేదు,గతం లో ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పుడుకు అది కార్యరూపం దాల్చలేదు,ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు,గాయాలు పాల అయిన వారికి,ప్రాణ నష్టం జరిగిన వారికి కలిపి సుమారు రెండు కోట్ల రూపాయలు వరకు నష్ట పరిహారం చెల్లించింది, ఒక వైపు ఫారెస్ట్ అధికారులు కష్టం మరో వైపు ప్రభుత్వం నష్ట పరిహారం రూపం లో చెల్లిస్తున్న కోట్ల రూపాయలు  వృధా అవుతున్నా శాశ్విత పరిష్కారం చుపలేకపోతున్నారు.

కురుపాం, పార్వతీపురం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అధికారులు కు నిరంతరం ఏనుగులు ను ట్రాక్ చేస్తున్న ఎలిఫెంట్ ట్రాకర్ లు కు కూడా చేతిలో బాంబులు పేలి గాయాలు పాల అయ్యారు,ఎవరో చనిపోతే ఆస్తి నష్టం జరిగి రైతులు రోడ్ ఎక్కితేనే ఈ విషయం పై ఒకరోజు చర్చ జరిగి తరవుతా వదిలేయడం కారణంగా ఇన్ని ఏళ్లుగా ఈ సమస్య కు పరిష్కారం కాలేదు,ఇప్పటికి అయిన ఫారెస్ట్ అధికారులు ,నాయకులు,శాశ్విత పరిష్కారం చూపాలని ప్రజలు,రైతులు కోటుతున్నారు.

 మూడు ఏనుగులు మృతి..

మనుషులు ప్రాణాలు, ఆస్తి నష్టం ఎంత ముఖ్యమో ముగ జీవులు ప్రాణాలు కాపాడటం కూడా మనకు అంతే ముఖ్యం,గతం లో ఒక ఏనుగు విద్యుత్ షాక్ తో మరో ఏనుగు నాగావళి నదిలో చిక్కుకొని మృతి ఛేధింది.మూడవ ఏనుగు అనారోగ్యంతో మృతి చెందింది.. దీనితో జంతు ప్రేమికులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు,ముగ జీవులు కు ప్రజలు కు ఇరువులు కు ఇబ్బంది లేని ప్రదేశానికి వాటిని తరలించాలని కోరుతున్నారు.

త్రాగునీటికి కటకట లాడుతున్న గిరిజన గ్రామాలు

 త్రాగునీటికి కటకట లాడుతున్న గిరిజన గ్రామాలు

మంచినీటి పథకాలు పుష్కలం ఫలితం మాత్రం శూన్యం
 ఏజెన్సీలో తూతూ మంత్రంగా తాగునీటి నిర్మాణాలు
 జేబులు నింపుకుంటున్న అధికార్లు కాంట్రాక్టర్లు
ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పనితీరుపై గిరిజన సంఘం ఆగ్రహం

పెన్ పవర్ , విశాఖపట్నం

 విశాఖ ఏజెన్సీలో తాగు నీరు సదుపాయం లేక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు కోసం ఊటలు గెడ్డలను ఆశ్రయిస్తున్నారు. గిరిజనుల తాగు నీటి పధకాల పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికి వీసమెత్తు ఫలితం ఇవ్వడం లేదు.తూతూ మంత్రంగా నిర్మణాలు చేసి కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారని గిరిజన సంఘం గిరిజన సమైక్య ఆరోపిస్తున్నారు. దీనికి పెదబయలు మచ్చుతునకగా చెప్పవచ్చు. పెదబయలు మండలం 23 పంచాయతీల పరిధిలో నూటికి 80%  గ్రామాలలో సురక్షిత మంచినీరు అందుబాటులో లేదని 48% శాతం పైగా గ్రామాలు గ్రావిటీ ద్వారా ఆధారపడి బతుకుతున్నాయని 30% శాతం గ్రామాల్లో నేటికీ ఊట గడ్డ మీద ఆధారపడి ఉన్నదని కేవలం 28% గ్రామాల్లో మాత్రమే బోర్ పంపులు సోలార్ ద్వారా మంచినీళ్లు తాగుతున్నారని  2014 -2018 మధ్యకాలంలో ప్రతి గ్రామానికి బోర్ పంపుల ద్వారా ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినప్పటికీ  ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం, పనిలో నాణ్యత లేకపోవడం వల్ల కోట్ల రూపాయలు డబ్బులు వృధా అవడంతో పాటు, సొమ్ము చేసుకున్నారు దీనిపై ఉన్నతాధికారులు సరి అయిన దర్యాప్తు చేసి గిరిజనులకు నీళ్లు అందించే విషయంలో పూర్తి వైఫల్యం చెందారని  విమర్శించారు. గత మూడేళ్ల క్రితం  గోమంగి  పంచాయితీ సరియపల్లి గ్రామంలో  12 లక్షల రూపాయలు వెచ్చించి బోరు తీసి ఒక మంచినీటి ట్యాంక్ నిర్మించారు కానీ ట్యాంకులో ఒక్క బొట్టు మంచినీరు పడలేదు 12 లక్షలు అప్పనంగా కాంట్రాక్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మింగేశారు. 

ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారి అయిన జగదీష్ గారిని వివరణ కోరితే సంబంధంలేని కారణాలు చెప్పి తప్పించుకున్నారు మిగిలిన గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఉన్నత అధికారులు జోక్యం చేసుకోకపోవడం వల్ల ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆగడాలకు అంతులేకుండా పోయిందనీ అన్నారు. మంచి నీటి సమస్యపై పంచాయతీ కార్యదర్శులకు సర్పంచులకు రిపోర్టు చేస్తే తము పంచాయతీ తీర్మానాలు పెట్టిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులను నుండి సరైన స్పందన ఉండదని  ఎస్టిమేషన్ వేసే విషయంలో అలాగే చేసిన పనికి నిధులు  మంజూరు చేసే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతుంది. గోమంగి గ్రామంలో 100 నుండి 150 గిరిజన కుటుంబాలకు  గ్రావిటీ నీళ్లే గతి గ్రావిటీ  ద్వారా వస్తున్న చుక్క చుక్క నీళ్ల కోసం గంటల తరబడి వేచి చూడాలి అది కూడా ఏ సమయంలో వస్తుందో తెలియని పరిస్థితి నీళ్లు రాకపోతే  ప్రతిసారి స్థానిక గ్రామస్తులే వెళ్లి చిన్నచిన్న మరమత్తులు చేసుకుని జీవిస్తున్నారు గ్రావిటీ నుండి నీళ్లు రాకపోతే ప్రత్యామ్నాయంగా మంచినీటి బావి గాని ఊట గడ్డ లు గాని బోర్వెల్ గాని అందుబాటులో లేకపోవడం వల్ల  గత్యంతరం లేక  గడ్డ నుండి కలుషితమైన బురద నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని దీని ఫలితంగా ప్రస్తుతానికి ప్రతి ఒక్క ఇంట్లో సీజనల్ వాంతులు విరోచనాలు చలి జ్వరం తలనొప్పి అనేక వైరస్ లకు గురవుతున్నారని మండిపడ్డారు.  ఇప్పటికైనా నిధులు దుర్వినియోగం చేయకుండా ఆయా గ్రామ పంచాయతీల ప్రజలకు ఉపయోగపడే విధంగా నిధులు ఖర్చు పెట్టి త్రాగు నీటిని అందించాలని  గోమంగి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటింటికి వెళ్లి వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, సురక్షిత మంచినీరు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ పుష్కలంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంచినీళ్లు  అందిస్తున్నామనే ఉద్దేశంతో నిధులను దుర్వినియోగంపరుస్తూ జేబులు నింపుకుంటున్నా సంబంధిత అధికారులపై చర్యలు తక్షణమే తీసుకోవాలని. మంచినీళ్ల సమస్య వెంటనే పరిష్కారం చేయకుండా అలసత్వం చేస్తున్న సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులను విధుల నుండి వెంటనే తొలగించాలని లేనిపక్షంలో అధికారులు ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి  కొమ్మ పృథ్వీరాజు గిరిజన సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి కూడా రాధాకృష్ణ గోమంగి   శేఖర్ రుంజాల జయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ఏజెన్సీలో మొక్కుబడిగా నడుస్తున్న అంగన్ వాడి కేంద్రాలు.

ఏజెన్సీలో  మొక్కుబడిగా నడుస్తున్న అంగన్ వాడి కేంద్రాలు.


గిరిజన పిల్లలకు  కల్లిపోయిన గుడ్లు పంపిణీ. 

అంగన్వాడి కేంద్రాలపై  కొరవడిన పర్యవేక్షణ.

విశాఖపట్నం, పెన్ పవర్ 

 విశాఖ ఏజెన్సీలో అంగన్ వాడి కేంద్రాలు మొక్కుబడిగా నడుస్తున్నాయి. కేంద్రాల ద్వారా గిరిజన పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదని తల్లిదండ్రులు  ఆరోపిస్తున్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అంగన్ వాడి కేంద్రాలు తూతూ మంత్రంగా నడుస్తున్నాయి. గిరిజనులకు అందాల్సిన పౌష్టిక ఆహార పదార్థాలు  మొక్కుబడిగ  ఇస్తున్నారని ఆరోపణలు బాహటంగా వినిపిస్తున్నాయి.  గిరిజన చిన్నారులకు  గర్భిణీలు బాలింతలకు  నిబంధనల ప్రకారం అందించాల్సిన  కోడిగుడ్లు పాలు  గోధుమపిండి  చెనగ చెక్కులు  ఎండు ఖర్జూరం   బియ్యం నూనె పప్పులు పంపిణీ  సక్రమంగా లేదని  గిరిజన మహిళలు  గిరిజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో ఐసిడిఎస్ ప్రాజెక్టు కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రాజెక్ట్ అధికారులు మాత్రం పట్టణాలనుంచి అడపాదడపా వచ్చి పోతున్నట్లు సమాచారం. అధికారి రాలేదని ఎవరైనా ప్రశ్నిస్తే మీటింగ్ కు వెళ్లారన్న  సమాధానం కార్యాలయ సిబ్బంది నుంచి వస్తున్నది.  ఇక  సిబ్బంది  విధులు చెప్పనవసరం లేదు.పర్యాటక కేంద్రం ఐన అరకు ఐసిడిఎస్ ప్రాజెక్టు ప్రత్యేక నిదర్శనం. అంగన్ వాడీ కేంద్రాల పనితీరు వర్ణనాతీతం. వర్రా గ్రామ అంగన్ వాడీ కేంద్రం లో గిరిజన చిన్నారులకు కుల్లిన కోడి గుడ్లుని కార్యకర్త పంపిణీ  చేసిందని తల్లులు ఆరోపించారు. పీఓ పట్టించుకోక పోవడం వలన కార్యకర్త లు ఇష్టానుసారం గా తెరుస్తున్నరని మండి పడుతున్నారు. కుల్లిన గుడ్లు పంపిణీ పై అరకు ఐసిడిఎస్ పీఓని వివరణ  కోరేందుకు ప్రయత్నించగా ఆమే అందుబాటులో లేరు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...